Ajay Jadeja: రాజకుటుంబ వారసుడిగా టీమిండియా మాజీ క్రికెటర్‌!

జామ్‌ నగర్‌ రాజకుటుంబం తమ తరువాతి వారుసుడిగా టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజాను ప్రకటించింది. ఈ విషయం గురించి ప్రస్తుత మహారాజు శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్‌ సింహ్‌జీ జడేజా అధికారికంగా ప్రకటించారు.

ajay
New Update

Team India : జామ్‌ నగర్‌ రాజకుటుంబం తమ తరువాతి వారుసుడిగా టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజాను ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రస్తుత జాం సాహెబ్ (మహారాజు) శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్‌ సింహ్‌జీ జడేజా అధికారికంగా ప్రకటించారు. అజయ్‌ జడేజా తమ రాజకుటుంబ వారసత్వ సింహాసనాన్ని అధిష్టిస్తారని ఆయన వివరించారు.

‘పాండవులు 14 సంవత్సరాల అరణ్యవాసం, అజ్ఞాత జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని అనంతరం విజయం సాధించిన రోజు దసరా. కాబట్టి ఈ రోజు అజయ్ జడేజాను రాజ కుటుంబానికి వారసుడిగా, నవానగర్‌కు తదుపరి జాం సాహెబ్‌గా ప్రకటిస్తున్నాం.. ఇది జామ్‌నగర్ ప్రజలకు గొప్ప వరం అని నమ్ముతున్నాను.. థాంక్యూ అజయ్’ అని శత్రుసల్యసింహ్‌జీ ప్రకటించారు.

ఒకప్పటి నవానగర్‌ సంస్థానాన్నే ప్రస్తుతం జామ్‌నగర్‌గా పిలుస్తున్నారు. స్వాతంత్య్రం తర్వాత దేశంలో రాచరిక వ్యవస్థను రద్దుచేసి సంస్థాలను ఇండియన్ యూనియన్‌లో విలీనమైపప్పటికీ గుజరాత్‌లోని ఈ ప్రాంతంలో మాత్రం ఇంకా రాజకుటుంబ పాలనే ఉంది. 

జామ్‌నగర్ రాజ కుటుంబానికి చెందిన అజయ్ జడేజా క్రికెట్‌‌పై ఇష్టంతో మైదానంలో అడుగుపెట్టి ఆటలోతనదైన ముద్ర వేశారు. 1992-2000 వరకు 15 టెస్ట్ మ్యాచ్‌లు, 196 వన్డేలలో భారతజట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఇక, దేశీయ క్రికెట్‌లో అత్యంత కీలకమైన రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లకు వీరి కుటుంబసభ్యులైన K.S.రంజిత్‌సింహ్‌జీ K.S. దులీప్‌సింహ్‌జీ పేర్లు పెట్టడం విశేషం.

Also Read :  తెలంగాణకు మళ్లీ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్

#team-india #ajay-jadeja
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe