/rtv/media/media_files/2024/10/19/9HZKCbtURTiJrUqS6q2c.jpeg)
Telangana CM Revanth Reddy:
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రేపు అనగా శనివారం ఉదయం రేవంత్ రెడ్డి హైదరాబాద్​ నుంచి బయలుదేరి 10 గంటలకు నాగ్​పూర్​కు చేరుకుంటారు. అక్కణ్నుంచి చంద్రాపూర్​ లో అక్కడి నేతలతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత వరుసగా రాజురా, డిగ్రాస్, వార్దా​ నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొని రాత్రికి తిరిగి నాగ్​పూర్​ చేరుకుంటారు.
ఇక రెండో రోజు...ఆదివారం ఉదయం నాగ్​పూర్​ నుంచి నాందేడ్​కు రేవంత్ చేరుకుంటారు.నయగావ్, భోకర్​​, షోలాపూర్​ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
Also Read: Cricket: ఇలా ఆడేశారేంట్రా..సౌతాఫ్రికాపై శాంసన్, తిలక్ ఊచకోత