SRH vs DC : పీకల్లోతు కష్టాల్లో సన్‌రైజర్స్.. దెబ్బతీసిన రూ.11 కోట్ల బౌలర్!

వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది.  ఏకంగా 37 పరుగులకే 4 కీలకమైన వికెట్లను కోల్పోయింది. ఢిల్లీ బౌలర్ మిచెల్‌ స్టార్క్‌ మూడు వికెట్లు తీశాడు.

New Update
srh-vs-dc-match

srh-vs-dc-match

వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది.  ఏకంగా 37 పరుగులకే 4 కీలకమైన వికెట్లను కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ కు తొలి ఓవర్‌ లోనే బిగ్ షాక్ తగిలింది. ఓవర్ ఐదో బంతికి అభిషేక్‌(1) రనౌట్‌గా వెనుదిరిడాడు. ఆ తరువాత మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో  స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఇషాన్‌ కిషన్‌ (2) కూడా వెనుదిరిగాడు. ఆ వెంటనే మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో భారీ షాట్ఆడబోయిన నితీశ్‌కుమార్‌ రెడ్డి అక్షర్‌ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌ అయ్యాడు. ఇక కాస్త దూకుడుగా ఆడుతున్న ట్రావిస్‌ హెడ్‌ (22) కూడా మిచెల్ స్టార్క్ బౌలింగ్ లోనే కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా మిచెల్‌ స్టార్క్‌ ను ఢిల్లీ యాజమాన్యం రూ. 11.75 కోట్లకు కొనుగోలు చేసింది.  

జట్లు ఇవే!  

SRH: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ

DC: జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, KL రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్

ఇది కూడా చూడండి: UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!

ఇది కూడా చూడండి: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు