BIG BREAKING: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలికాడు. స్పిన్ అనుభవం ఉన్న రవిచంద్రన్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. అశ్విన్ సీఎస్కే తరఫున ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.

New Update
Ravichandran Ashwin

Ravichandran Ashwin

స్టార్ క్రికెటర్, మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అశ్విన్ ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అశ్విన్ తాజాగా ఐపీఎల్ ఫార్మాట్ నుంచి వైదొలగుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. "ప్రతి ముగింపు కొత్త ప్రారంభంతో ప్రారంభమవుతుంది.. ఐపీఎల్ క్రికెటర్‌గా నా సమయం ఈ రోజుతో ముగుస్తుంది. కానీ వివిధ లీగ్‌ల చుట్టూ ఆటను అన్వేషించే నా సమయం ఈ రోజుతో ప్రారంభమవుతుంది" అని అశ్విన్ X లో పోస్ట్ చేశాడు.

ఇది కూడా చూడండి: India-Pakistan: 'రెండు మ్యాచ్‌లు మేమే గెలుస్తాం, ఇన్షా అల్లాహ్'.. పాకిస్థాన్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్‌లో రవిచంద్రన్ ఆడిన మొత్తం మ్యాచ్‌లు..

రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌లో 221 మ్యాచ్‌లు ఆడి మొత్తం 187 వికెట్లు తీశాడు. అయితే అశ్విన్ కేవం చెన్నైకి మాత్రమే కాకుండా పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, పూణె జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు.  ఇక టీమిండియా తరఫున అశ్విన్ 106 టెస్టులు ఆడి 537 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్‌లో 3503 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో అశ్విన్‌ వ్యక్తిగత స్కోర్ 124. 116 వన్డే మ్యాచుల్లో 156 వికెట్లు తీసుకున్నాడు. 65 టీ20 మ్యాచుల్లో 72 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇది కూడా చూడండి: Rohith Sharma: టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణమిదే.. మొదటిసారి అసలు కారణం చెప్పిన రోహిత్ శర్మ!

యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆరోపణలు చేసిన అశ్వీన్..

అశ్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అశ్విన్ ఎన్నో విషయాలను బయట పెట్టారు. అయితే వీటిపై అశ్విన్ తీవ్ర విమర్శలు కూడా అందుకున్నారు. ఈ సీజన్‌లో అశ్విన్ రూ.75 లక్షల బేస్ ప్రైజ్‌కి మించి అమ్ముడుపోలేదు. ఎన్నో ఆరోపణలను అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలియజేశారు. దీంతో పలువురు అశ్విన్‌పై విమర్శలు చేశారు.

Advertisment
తాజా కథనాలు