BREAKING NEWS : శ్రీలంక క్రికెటర్ అరెస్ట్ !

పార్కింగ్ విషయంలో తన పొరుగువారిపై దాడి చేశాడనే ఆరోపణలపై శ్రీలంక పోలీసులు క్రికెటర్ అషేన్ బండారాను అరెస్టు చేశారు. శ్రీలంక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటన శనివారం సాయంత్రం పిలియండలలోని కోలమున్నలో బండారా నివాసం ఉంటున్న ప్రాంతంలో జరిగింది.

New Update
Ashen Bandara

పార్కింగ్ విషయంలో తన పొరుగువారిపై దాడి చేశాడనే ఆరోపణలపై శ్రీలంక పోలీసులు క్రికెటర్ అషేన్ బండారాను అరెస్టు చేశారు. శ్రీలంక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటన శనివారం సాయంత్రం పిలియండలలోని కోలమున్నలో బండారా నివాసం ఉంటున్న ప్రాంతంలో జరిగింది. రోడ్డుకు అడ్డుగా ఉన్న వాహనం విషయంలో అషేన్ బండారా తన పొరుగువారితో తీవ్ర వాగ్వాదానికి దిగాడని తెలుస్తోంది. అయితే ఆ వాదన తర్వాత, బండారాపొరుగువారి ఇంట్లోకి వెళ్లి ఆ వ్యక్తిపై దాడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు  బండారాను అరెస్టు చేశారు. అయితే కొద్దీసేపటికే అతనని బెయిల్ మంజూరు అయింది.  మార్చి 12 (బుధవారం) కోర్టులో హాజరు కావాల్సి ఉంది. 

ఆఫ్ఘనిస్తాన్‌తో చివరిసారిగా

బండారా తన కెరీర్‌లో ఇప్పటివరకు శ్రీలంక తరపున ఆరు వన్డేలు, టీ20 ఆడాడు, రెండు ఫార్మాట్లలో వరుసగా 141, 97 పరుగులు చేశాడు. మార్చి 2021లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన బండారా 2023 అక్టోబర్ హాంగ్‌జౌలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తరపున చివరిసారిగా ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది. బండారాకి దేశవాళీ క్రికెట్‌లో చాలా మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఇప్పటివరకు అతను 49 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 89 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, 61 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో, అతను దాదాపు 41 సగటుతో 2578 పరుగులు చేశాడు, ఇందులో ఐదు సెంచరీలు మరియు 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 

Also read :   పుష్ప టీమ్కు మరో షాక్.. హైకోర్టులో ఇంకో పిటిషన్

Also read :  భారత్‌లోకి ‘బార్బీ ఫ్లిప్’ ఫోన్.. లుక్ చూస్తే కిక్కెక్కాల్సిందే!

Advertisment
తాజా కథనాలు