Ind vs Sa: భారత్తో జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా విజయం సాధించింది. నాలుగు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం ఓవల్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో సఫారి జట్టు 3 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా.. 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
వరుణ్ చక్రవర్తికి 5..
మొదటి నుంచి ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో సఫారీ జట్టులో స్టబ్స్ (47*) టాప్ స్కోరర్ గా నిలిచాడు. హెన్రిక్స్ 24 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. భారత బ్యాటింగ్ లో హార్దిక్ పాండ్య (39: 45 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్) రాణించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ స్టబ్స్ దక్కించుకున్నాడు.
ఇక మొదటి మ్యాచ్లో సెంచరీ చేసిన సంజు శాంసన్ ఈ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (4) మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (4), తిలక్ వర్మ (20), అక్షర్ పటేల్ (27) పరుగులు చేశారు.