/rtv/media/media_files/2025/03/12/eZ9eEbdrDFIrgeqWlA2p.jpg)
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మాజీ భర్త, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ గత ఏడాది జనవరి 20న నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ జంట తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలలో నటి సనా జావేద్ గర్భవతి అని తెలుస్తోంది. దీనిపై ఈ దంపతుల నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.
2010లో సానియా మీర్జాతో పెళ్లి
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను 2010లో షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్నాడు. అప్పట్లో వీరిద్దరి వివాహాన్ని చాలా మంది వ్యతిరేకించారు. ఎందుకంటే షోయబ్ సానియాను రెండోసారి వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత సానియా ఒక కొడుకుకు జన్మనిచ్చింది. కానీ షోయబ్ వివాహేతర సంబంధాలతో విసిగిపోయిన ఆమె మాలిక్ కు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు సానియా తన కొడుకుతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది.
Also read : కుర్చీ చేత పట్టుకుని..నాలుక బయటపెట్టి..ట్రూడో ఫొటో వైరల్!
2024లో సనా జావేద్ తో పెళ్లి
సనా జావేద్, షోయబ్ మాలిక్ జనవరి 2024లో వివాహం చేసుకున్నారు. అంతకుముందు సనా జావేద్ .. ఉమర్ జైస్వాల్‌లను పెళ్లి చేసుకోగా ఇరువురు విడాకులు తీసుకున్నారు. అనంతరం షోయాబ్ మాలిక్ తో కొన్ని రోజులు డేటింగ్ చేసిన అనంతరం అతన్ని రెండో పెళ్లి చేసుకుంది. కాగా షోయబ్ మాలిక్ కి ఇది మూడో పెళ్లి కావడం విశేషం. షోయబ్ మూడో వివాహాన్ని భారత్ మాత్రమే కాదు, పాకిస్తాన్ కూడా వ్యతిరేకించింది. షోయబ్, సనా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నారు.
Also Read : హైజాక్ నుంచి 80మందిని రక్షించిన పాక్ ఆర్మీ..13 మంది ఉగ్రవాదులు హతం