/rtv/media/media_files/2025/09/13/pak-2025-09-13-15-22-11.jpg)
ఆసియా కప్‌లో భాగంగా రేపు దుబాయ్ వేదికగా రేపు భారత్, పాక్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా కీలక కామెంట్స్ చేశాడు. ఒమన్‌తో గెలుపు తర్వాత మీడియాతో మాట్లాడుతూ, "గత కొన్ని నెలలుగా మేము మంచి క్రికెట్ ఆడుతున్నాం. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయగలిగితే, మేము ఏ జట్టునైనా ఓడించగలం" అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Kidnapping Case: తిరుపతిలో రౌడీషీటర్ హల్చల్..తల్లీకూతుళ్లను కిడ్నాప్ చేసి..
బౌలింగ్ ప్రదర్శన పట్ల సంతృప్తి
తమ జట్టు బౌలింగ్ ప్రదర్శన పట్ల అఘా సంతృప్తి వ్యక్తం చేశారు. "బౌలింగ్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా స్పిన్నర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. షాహీన్ తన రెండో స్పెల్‌లో, ఫహీమ్ కూడా బాగా బౌలింగ్ చేశారు. దుబాయ్‌లో ఆడుతున్నప్పుడు ఎక్కువ మంది స్పిన్నర్లు ఉండటం చాలా అవసరం," అని ఆయన అన్నారు. తమ బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ, ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని అంగీకరించారు. "బ్యాటింగ్ విషయంలో మేము ఇంకా కష్టపడాలి. ఒమన్‌తో మ్యాచ్‌లో మేము మొదట 180కి పైగా పరుగులు చేయాల్సింది. కానీ క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం," అని తెలిపారు. భారత్‌తో జరగబోయే కీలక మ్యాచ్ నేపథ్యంలో అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also read : Manipur riots: మూడేళ్ల తర్వాత ప్రధాని మోదీ.. మణిపూర్‌లో అసలు ఏం జరుగుతోంది..?
Salman Ali Agha on Pakistan v India.
— Sheri. (@CallMeSheri1_) September 12, 2025
We have been playing some really good cricket, we won the tri-series and won here comfortably, if we executed our plans for a longer period then we are good enough to beat any team. pic.twitter.com/hQLWWYPKBV
హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు
మొత్తంగా, భారత్‌తో జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు సల్మాన్ అఘా చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. కాగా ఆసియా కప్ ప్రారంభానికి ముందు, సల్మాన్ అఘా మెడ కండరాల నొప్పితో బాధపడుతున్నారని, ఒమన్ మ్యాచ్‌కు దూరంగా ఉండవచ్చని వార్తలు వచ్చాయి. అయితే, ఆ మ్యాచ్‌లో ఆయన పూర్తి ఫిట్‌నెస్‌తో ఆడటంతో ఆ వార్తలకు తెరపడింది. మరోవైపు ఈ మ్యాచ్ నేపథ్యంలో బాయ్‌కాట్ ఆసియా కప్, బాయ్‌కాట్ INDvsPAK’ అనే హ్యాష్ ట్యాగ్‌లు ఎక్స్ వేదికగాట్రెండ్ అవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిని తామింకా మరిచిపోలేదని, పాకిస్తాన్ తో క్రికెట్ ఆడొద్దని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచును బీసీసీఐ బ్యాన్ చేయకపోయినా దేశ ప్రజలు బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Also Read : OG Trailer Date: 'OG' ప్లానింగ్ మామూలుగా లేదుగా.. బ్యాక్ 2 బ్యాక్ ప్రమోషన్స్ షురూ..!