SA vs NZ: రెండో సెమీస్ రెడీ.. టాస్‌ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌..!

రెండో సెమీస్ రెడీ అయింది. దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచే జట్టు ఫైనల్‌లో భారత్‌ను ఢీకొట్టనుంది.

New Update
New Zealand won the toss and elected to bat

New Zealand won the toss and elected to bat

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్ మధ్య రెండో సెమీస్ ప్రారంభమైంది. పాకిస్తాన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో దక్షిణాఫ్రికా ఫీల్డింగ్‌కు సిద్ధమైంది. ఈ రెండో సెమీస్ మ్యాచ్‌లో ఏ టీం అయితే విన్ అవుతుందో.. ఆ జట్టు మార్చి 9న భారత్‌తో తలపడనుంది. 

Also Read :  అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం

న్యూజిలాండ్ జట్టు

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టులో.. విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్‌ లేథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, కేల్ జేమీసన్, విలియమ్‌ ఓరూర్కీ ఉన్నారు. 

Also Read :ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..

దక్షిణాఫ్రికా జట్టు

అదే సమయంలో దక్షిణాఫ్రికా తుది జట్టులో.. రైన్ రికెల్‌టన్, టెంబా బవుమా (కెప్టెన్), రస్సీ వాన్‌డర్‌ డస్సెన్, హెన్రిచ్‌ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఐదెన్ మార్‌క్రమ్, వాన్‌ ముల్డర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి ఉన్నారు. మరి ఈ రెండు జట్లు ఇవాళ మ్యాచ్‌లో ఏ విధమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాయో చూద్ధాం.

Also Read :  మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఇదిలా ఉంటే ఫైనల్ కోసం ఈ రెండు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ సెమీ ఫైనల్ మ్యాచ్‌ ఆసక్తికరంగా జరగనుంది. దీనికోసం క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత ట్రోఫీ గెలవాలన్న కసితో ఈ రెండు జట్లు ఉన్నాయి. 

Also Read :చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?

దీంతో సెమీస్‌లో ఇవి ఎలా ఆడతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఐసీసీ టోర్నీలు కొన్నేళ్లుగా సౌతాఫ్రికాకు, న్యూజిలాండ్‌కు అస్సలు కలిసి రాలేదు. ముఖ్యంగా న్యూజిలాండ్ చాలా సార్లు ఆఖరివరకు పోరాడి ఓటమి పాలైంది. మరి ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు