CSK vs MI : మళ్లీ డకౌట్.. రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డు!

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్ లో రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డు నెలకొల్పాడు.  ఖలీల్‌ అహ్మద్‌ నాలుగో బంతికి రోహిత్‌ శర్మ ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. దీంతో అత్యధిక డకౌట్‌లుగా రికార్డును సమం చేశాడు.

New Update
rohit mi

చిదంబరం స్టేడియం వేదికగా  చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డు నెలకొల్పాడు.  ఖలీల్‌ అహ్మద్‌ వేసిన మొదటి ఓవర్ నాలుగో బంతికి రోహిత్‌ శర్మ ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. మూడు బంతులు ఎదరుకున్న రోహిత్ నాలుగో బంతికి ఔటయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్  అత్యధికంగా డకౌట్‌లైన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ శర్మ ఇప్పుడు వీరి సరసన చేరాడు.  


కాగా ముంబై ప్రస్తుతం 44 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్ (12), తిలక్ వర్మ(8) పరుగులతో ఉన్నారు.   

జట్లు ఇవే 

ముంబై జట్టు :  రోహిత్‌ శర్మ, రేయాన్‌ రికెల్టన్‌ (వికెట్‌ కీపర్‌), విల్‌ జాక్స్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, నమన్‌ ధిర్‌, రాబిన్‌ మింజ్‌, మిచెల్‌ శాట్నర్‌, దీపక్‌ చాహర్‌, ట్రెంట్ బౌల్ట్‌, సత్యనారాయణ రాజు

చెన్నై జట్టు :  రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌), రచిన్‌ రవీంద్ర, దీపక్‌ హుడా, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, సామ్‌ కరన్‌, ఎంఎస్‌ ధోని (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, నూర్‌ అహ్మద్‌, నాథన్‌ ఎల్లిస్‌, ఖలీల్‌ అహ్మద్‌

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు