/rtv/media/media_files/2025/02/24/xYVhXUsWT9WdQQo2zMfg.jpg)
మహిళల ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ చరిత్ర సృష్టించింది. టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా అవతరించింది. ఇప్పటివరకు మహిళల ప్రీమియర్ లీగ్ లో పెర్రీ 795 పరుగులు చేసింది.యూపీతో జరుగుతున్న మ్యాచ్‌లో పెర్రీ ఈ రికార్డును సృష్టించింది. అంతకుముందు ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన మెగ్ లానింగ్ (782) పేరిట ఉంది. లానింగ్ 22 మ్యాచ్‌ల్లో 39.10 సగటుతో, 128.40 స్ట్రైక్ రేట్‌తో 782 పరుగులు చేసింది. ఇందులో 7 అర్ధ సెంచరీలున్నాయి.
ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ
కాగా ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. టోర్నమెంట్ మొదటినుంచి ఆర్సీబీ తరుపున ఆడుతున్న కోహ్లీ.. 252 మ్యాచ్‌ల్లో 38.66 సగటుతో, 131.97 స్ట్రైక్ రేట్‌తో 8004 పరుగులు చేశాడు. 36 ఏళ్ల విరాట్ ఈ లీగ్ లో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇందులో 705 బౌండరీలు 272 సిక్సర్లు బాదాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ టీమ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ 6 వికెట్ల నష్టానికి 20 ఓవర్లకు గానూ 180 పరుగులు చేసింది. వ్యాట్-హాడ్జ్ (57), ఎల్లీస్ పెర్రీ (90) పరుగులతో రాణించారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : స్మృతి మంధాన (కెప్టెన్), డాని వ్యాట్-హాడ్జ్, ఎల్లీస్ పెర్రీ, రాఘవీ బిస్ట్, రిచా ఘోష్ (కెప్టెన్), కనికా అహుజా, జార్జియా వారేహమ్, స్నేహ్ రాణా, కిమ్ గార్త్, ఏక్తా బిష్ట్, రేణుకా సింగ్.
యుపి వారియర్జ్ : దీప్తి శర్మ (కెప్టెన్), కిరణ్ నవ్‌గిరే, వృందా దినేష్, తహ్లియా మెక్‌గ్రాత్, శ్వేతా సెహ్రావత్, గ్రేస్ హారిస్, ఉమా చెట్రీ (కెప్టెన్), చినెల్లే హెన్రీ, సోఫీ ఎక్లెస్టోన్, సైమా ఠాకూర్, క్రాంతి గౌడ్.
Also Read: భారత్‌లో ప్రతీ ఐదుగురిలో ముగ్గురు క్యాన్సర్‌తో మృతి.. సర్వేలో సంచలన విషయాలు