పాక్ క్రికెటర్లకు 4 నెలలుగా జీతాల్లేవా? ఇందులో నిజమెంత?

దాయాది దేశమైన పాకిస్థాన్‌ గత కొన్ని రోజుల నుంచి ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతోంది. ఆ దేశ క్రికెటర్ల పరిస్థతి ఇలానే ఉందని, నాలుగు నెలల నుంచి కనీసం జీతాలు కూడా లేవని వార్తలు వినిపిస్తున్నాయి.

pak
New Update

దాయాది దేశమైన పాకిస్థాన్ పరిస్థితి రోజురోజుకి దిగజారుతుంది. ప్రస్తుతం ఆ దేశం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంది. దేశంలోని ఎక్కువ శాతం ప్రజలు తినడానికి తిండి, ఉద్యోగాలు లేక పేదరికంలో బతుకుతున్నారని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ఆ దేశ క్రికెటర్ల పరిస్థితి కూడా ప్రస్తుతం దారుణంగా ఉందని తెలుస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ జట్టులోని క్రికెటర్లకు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చూడండి: కేక్‌ తింటే క్యాన్సర్.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఫుడ్ కార్పోరేషన్

మహిళల జట్టు కూడా..

జీతాలు చెల్లించకపోవడం వల్ల ఆటగాళ్లు ప్రమోషన్స్, స్పాన్సర్‌షిఫ్ల్ లోగోలను బహిష్కరిస్తామని హెచ్చరించినట్లు సమాచారం. అయితే కేవలం పురుషుల జట్లుకే కాకుండా మహిళల జట్లుకు కూడా వేతనాలు అందడం లేదట. స్టార్ క్రికెటర్లు అయిన బాబర్ అజామ్, రిజ్వాన్, షహీన్ షా ఆఫ్రిదిలకు కూడా జీతాలు అందడంలేదు. పాకిస్థాన్ బోర్డు 2023 జులై 1 నుంచి 2026 జూన్ 30 వరకు మొత్తం 25 మందికి సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ఇచ్చింది. అయితే ఆటగాళ్ల ప్రదర్శన లేకపోవడం వల్ల సెంట్రల్ కాంట్రాక్ట్‌పై సంతకం చేయలేదని తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Cricket: అమ్మాయిలు అదిరిపోయే ఆరంభం ఇస్తారా..

జులై నుంచి ఇప్పటి వరకు జీతాలు లేవని క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల బాబర్ అజామ్ కెప్టెన్సీకి రాజీనామా చేయడం కూడా ఇదే కారణమని కొందరు భావిస్తున్నారు. పాక్ జట్టు ఎంత బాగా ప్రదర్శన చేసిన కనీసం నెలవారీ జీతాలు రావడం లేదు, గుర్తింపు రావడం లేదని పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ తెలిపారు. జట్టు సంక్షోభంలో కూరుకుపోయిందని, జట్టు ఐసీయూ పాలైందని వ్యాఖ్యానించారు.  

ఇది కూడా చూడండి: నేటి నుంచి మహిళల పొట్టి కప్.. ఇక అమ్మాయిల వంతే!

#cricketers #pakistan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe