Viral Video: రాంచీ వీధుల్లో రయ్ రయ్.. ధోనీ బైక్ రైడింగ్ చూసి ఫ్యాన్స్ ఫిదా!
హోండా రెప్సాల్ 150 మోటర్ బైక్‌లో రైడింగ్ చేస్తూ రాంచీ వీధుల్లో చక్కర్లు కొట్టాడు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీతో సెల్ఫీ కోసం ఓ అభిమాని ప్రయత్నించాడు.. అయితే అప్పటికే ధోనీ రయ్ రయ్‌మంటూ గేటు లోపలికి వెళ్లిపోయాడు. ఇటీవల వింటేజ్ కార్లలో తిరుగుతున్నట్లు కనిపించిన మహేంద్రుడు తాజాగా తనకు ఎంతో ఇష్టమైన బైక్‌లను డ్రైవ్ చేస్తూ కనిపించడం పట్ల ఫ్యాన్స్ తెగ ఆనందపడుతున్నారు.