/rtv/media/media_files/2025/04/06/jnTwF87gfKjAEdGOneTU.jpg)
Dhoni IPL retirement
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్ వార్తలపై తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ప్రస్తావించాడు. ఏప్రిల్ 5, శనివారం రోజున చిదంబరం స్టేడియంలోని స్టాండ్స్‌లో ధోని తల్లిదండ్రులు మ్యాచ్ చూస్తూ కనిపించినప్పుడు ధోనీ తన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వ్యాపించాయి. అయితే రాజ్ షమానీతో కొత్త పాడ్‌కాస్ట్‌లో, ధోని రిటైర్మెంట్ పుకార్లను ప్రస్తావిస్తూ ఈ సీజన్ చివరిలో తన కెరీర్‌కు ముగింపు పలకడం లేదని అభిమానులకు భరోసా ఇచ్చాడు.
And this is why he has been loved by Millions that too selflessly ❤️❤️..coz this Guy himself is so selfless 🥹🫶#MSDhoni#Dhonihttps://t.co/5B91AnJdD5
— Monica (@moniluvsfamily) April 6, 2025
శరీరం అందించే సహకారాన్ని బట్టి నిర్ణయం
44 ఏళ్ల వయసులో కూడా తాను క్రికెట్ ఆడుతున్నానని.. తదుపరి సీజన్ ఆడాలా వద్దా అనేది డిసైడ్ కావడానికి ఇంకా పది నెలల సమయం ఉందన్నాడు. అందుకు తన శరీరం అందించే సహకారాన్ని బట్టి నిర్ణయం ఉంటుందని ధోనీ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 కి ముందు, ధోని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, పరిస్థితులు అనుకూలించినంత కాలం క్రికెట్‌ను ఆస్వాదిస్తూనే ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు.
2008 నుండి చెన్నై తరుపున
ధోని 2008 నుండి చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నాడు. అతని నాయకత్వంలో ఆ జట్టు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. 2022లో రవీంద్ర జడేజాకు కెప్టెన్సీని అప్పగించినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ జట్టు బాధ్యతలను చేపట్టాల్సి వచ్చింది. 2023 ప్రారంభంలో ధోని తన కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు.
Ms Dhoni said 🗣️:- #MSDhoni#IPL#Ipl2025#DhoniRetirementpic.twitter.com/i8lYOI2GKX
— DhoniFan4Life💛 (@msdian_0507) April 6, 2025
Also Read : Bhadrachalam Temple : భద్రాద్రి రామయ్యకు"ప్రభుత్వ" కానుక..ఆనాటి నుంచే…..