IND W vs PAK W: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌‌లో దోమల బెడద.. ఆగిన మ్యాచ్

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌-2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కి దోమలు అంతరాయం కలిగించాయి. కొలంబో స్టేడియంలో కీటకాలు స్వార్మ్ అవ్వడంతో ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. దీంతో మ్యాచ్‌ను 15 నిమిషాలు నిలిపివేసి, గ్రౌండ్‌పై స్ప్రే చేశారు.

New Update
mosquito create problems in ind w vs pak w match of icc womens world cup 2025

mosquito create problems in ind w vs pak w match of icc womens world cup 2025


మహిళల ODI ప్రపంచ కప్ 2025 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ భారత్ VS పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. భారత్ మొదటి నుంచి పేవలమైన బ్యాటింగ్ చేస్తుంది. ఇప్పటికి ముగ్గురు కీలక ఆటగాళ్లను కోల్పోయింది. ఇప్పుడిప్పుడే టీమిండియా మహిళల జట్టు కోల్కుంటోందన్న సమయంలో గ్రౌండ్‌లో దోమల బెడద ఒక పెద్ద సమస్యగా మారింది. 

IND W vs PAK 

అధిక దోమలు, ఎగిరే కీటకాలతో ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. బ్యాటింగ్ సమయంలో భారత్ బ్యాటర్లు, బౌలింగ్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్ళు దోమలతో ఇబ్బందిపడుతున్నట్లు కనిపించారు. దీంతో వారు ఆన్-ఫీల్డ్ అంపైర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. దీని తర్వాత పాక్ ప్లేయర్స్ తమ డ్రెస్సింగ్ రూమ్ నుండి స్ప్రే బాటిల్‌ను తీసుకుని గ్రౌండ్‌లోకి వచ్చారు. అక్కడ మ్యాచ్ మధ్యలో దానిని స్ప్రే చేస్తున్నట్లు కనిపించారు. 

అయితే ఎంత స్ప్రే కొట్టినప్పటికీ గ్రౌండ్‌లో దోమలు, కీటకాల సమస్య తగ్గలేదు. మ్యాచ్ ప్రారంభంలో వాటి సంఖ్య తక్కువగా ఉన్నట్లు అనిపించింది. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ వాటి సంఖ్య క్రమంగా పెరిగింది. ఆటగాళ్ళు తమ రుమాలుతో దోమలను కొడుతూ కనిపించారు. సమస్య చాలా తీవ్రంగా మారడంతో మ్యాచ్ 15 నిమిషాలు ఆగిపోయింది. దోమల బెడద నిరంతరం ఉండటంతో మ్యాచ్‌ను 15 నిమిషాలు ఆపేశారు. అనంతరం దోమలను కంట్రోల్ చేసే బృందం పలు పరికరాలతో గ్రౌండ్‌లోకి వచ్చి స్ప్రే చేస్తున్నట్లు కనిపించారు. 

Advertisment
తాజా కథనాలు