Womens ODI World Cup: స్మృతి మంధాన, జెమిమాకు వరాలజల్లు.. కోట్లు కురిపించిన సీఎం

ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో చారిత్రక విజయాన్ని సాధించిన భారత జట్టు ప్లేయర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తమ రాష్ట్ర క్రీడాకారిణులైన స్మృతి మంధానా, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్‌లకు రూ.2.25 కోట్ల నగదు బహుమతి ప్రకటించారు.

New Update
womens cricketrs Smriti Mandhana

womens cricketrs Smriti Mandhana

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 టోర్నీ టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. ఈ చారిత్రాక విజయాన్ని సాధించిన భారత మహిళా క్రికెటర్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశంసలు కురిపించి భారీ నజరానా ప్రకటిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ప్రపంచ కప్‌2025లో భారత్ విజయం సాధించడంలో విశేష కృషి చేసినందుగానూ మహిళా క్రికెటర్లైన స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్‌లకు ముంబైలో ఘనంగా సన్మానం చేశారు. 

ఇందులో భాగంగా ఫడ్నవీస్ క్రీడాకారులకు జ్ఞాపికలను అందజేసి అభినందించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం క్రీడా విధానం ప్రకారం.. ఒక్కొక్కరికి రూ.2.25 కోట్ల భారీ నగదు బహుమతిని అందజేశారు. అదే సమయంలో ముంబైకి చెందిన టీమిండియా మహిళల జట్టు ప్రధాన కోచ్ అమోల్ మజుందర్‌కు కూడా నగదు బహుమతి అందిచారు. ఆయనకు రూ.25 లక్షలు ప్రకటించారు. 

మహారాష్ట్ర సీఎం సత్కారం

అనంతరం సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘‘మహిళా జట్టు ఐసిసి మహిళల ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకోవడం మనందరికీ చాలా గర్వకారణం. భారతదేశం తొలిసారిగా ట్రోఫీని గెలుచుకుంది. మీరు మహారాష్ట్రకు ఎంతో గర్వకారణం. ఈ విజయం రాష్ట్రానికి అపారమైన ఆనందాన్ని తెచ్చింది. స్మృతి మందన, జెమిమా రోడ్రిగ్జ్, రాధా యాదవ్, కోచ్ అమోల్ ముజుందార్ మహారాష్ట్రకు చెందినవారు.. కాబట్టి మేము వారిని స్వాగతించి గౌరవించాలని నిర్ణయించుకున్నాము. ఒక అథ్లెట్ అంతర్జాతీయ స్థాయిలో బాగా రాణించినప్పుడు.. వారికి దాదాపు రూ. 2.25 కోట్లు ప్రైజ్ మనీగా ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం ఉంది. కోచ్ కూడా రూ. 25 లక్షలు అందుకుంటాడు’’ అని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. 

మధ్యప్రదేశ్ సీఎం సత్కారం

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా పేసర్ క్రాంతి గౌడ్‌ను సత్కరించారు. ఛతర్‌పూర్ జిల్లాలోని ఘువారా గ్రామానికి చెందిన క్రాంతి గౌడ్.. భారతదేశం ప్రపంచ కప్ గెలవడంలో విశేష కృషి చేసినందుకు గాను ఆమెకు రూ.1 కోటి నగదు బహుమతి అందించారు.

ఏపీ సీఎం సత్కారం

స్పిన్నర్ శ్రీ చరణికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ బహుమతిని అందజేశారు. ఆమెకు రూ.2.5 కోట్ల నగదు బహుమతి, సొంత జిల్లా కడపలో 1000 చదరపు గజాల స్థలం, రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ 1 ఉద్యోగం ప్రకటించారు. 

Advertisment
తాజా కథనాలు