Lionel Messi : లియోనెల్ మెస్సీ ఇండియా షెడ్యూల్ ఖరారు.. మోదీతో భేటీ ఎప్పుడంటే?

లియోనెల్ మెస్సీ భారత పర్యటన షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఆయన భారత్‌లో ఉండనున్నారు. ఆయన పర్యటనలో ప్రధానంగా కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ నగరాలు ఉన్నాయి.

New Update
lionel messi

లియోనెల్ మెస్సీ భారత పర్యటన షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఆయన భారత్‌లో ఉండనున్నారు. ఆయన పర్యటనలో ప్రధానంగా కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ నగరాలు ఉన్నాయి.

మెస్సీ పర్యటన వివరాలు:

డిసెంబర్ 12 రాత్రి: మెస్సీ కోల్‌కతాకు చేరుకుంటారు. ఇది ఆయన పర్యటనలో ఎక్కువ సమయం ఉండే నగరం.

డిసెంబర్ 13 (కోల్‌కతా): ఉదయం 9 గంటలకు మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత, లేక్ టౌన్ శ్రీభూమి వద్ద ఆయన 70 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో 'GOAT కప్' , 'GOAT కాన్సర్ట్'లో పాల్గొంటారు.

డిసెంబర్ 13 సాయంత్రం (అహ్మదాబాద్): కోల్‌కతా నుండి అహ్మదాబాద్‌కు వెళతారు. అక్కడ అదానీ ఫౌండేషన్ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు.

డిసెంబర్ 14 (ముంబై): మధ్యాహ్నం 3:45 గంటలకు CCIలో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ ఉంటుంది. సాయంత్రం 5:30 గంటలకు వాంఖడే స్టేడియంలో 'GOAT కాన్సర్ట్' మరియు 'GOAT కప్' నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆయన భారత క్రికెటర్లతో కలిసి క్రికెట్ ఆడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

డిసెంబర్ 15 (న్యూఢిల్లీ): మెస్సీ భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఫిరోజ్ షా కోట్లాలో 'GOAT కాన్సర్ట్'లో పాల్గొంటారు.

ఈ పర్యటనలో మెస్సీ తన అభిమానులను కలుసుకోవడం, యువ క్రీడాకారులకు మార్గదర్శనం చేయడం, తన విజయాలను పంచుకోవడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈ షెడ్యూల్‌లో కేరళలో ఎలాంటి ఈవెంట్ లేదు. మెస్సీ భారత్‌కు రావడం ఇది రెండవసారి. అంతకుముందు 2011లో కోల్‌కతాలో వెనిజులాతో జరిగిన అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌లో ఆయన పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు