HBD Virat Kohli: క్రికెట్ కంటే కోహ్లీకి ఇష్టమైన ఆట ఏంటో తెలుసా?

నేడు కింగ్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు. అయితే విరాట్‌కి క్రికెట్ కంటే ఫుట్‌బాల్ అంటేనే ఇష్టమట. క్రికెట్ తర్వాత ఎక్కువగా ఫుట్‌బాల్ ఆడుతుంటాడు. ఫుట్‌బాల్‌పై ఉన్న ఇష్టంతో ఇండియన్ సూపర్ లీగ్‌ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో గోవా జట్టులో పార్ట్‌నర్‌గా కూడా ఉన్నాడు.

New Update
Virat Kohli :ఒక్కో ఇన్‌స్టా పోస్టుకు రూ.11.45కోట్లు.. కోహ్లీ ఏమన్నాడంటే?

కింగ్ విరాట్ కోహ్లీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దేశంలో కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ మాటల్లో చెప్పలేనిది. ఈ రోజు కింగ్ కోహ్లీ పుట్టిన రోజు కావడంతో దేశవ్యాప్తంగా అతని పుట్టిన రోజు వేడుకలను ఫ్యాన్స్ జరుపుకుంటున్నారు. కోహ్లీ 36వ ఏటలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే కోహ్లీ ఎవరూ బ్రేక్ చేయని రికార్డులను క్రికెట్‌‌లో సృష్టించాడని అందరికీ తెలిసిందే. కానీ కోహ్లీ గురించి తెలియని కొన్ని విషయాలు గురించి అతని పుట్టిన రోజు సందర్భంగా తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి:  Jio IPO: త్వరలో రాబోతున్న జియో ఐపీఓ.. ఎప్పుడంటే?

క్రికెట్ కంటే ఈ ఆట అంటేనే..

విరాట్ కోహ్లీకి క్రికెట్ కంటే ఫుడ్ బాల్ చాలా ఇష్టమట. క్రికెట్ తర్వాత ఎక్కువగా ఫుట్‌బాల్ ఆడుతుంటాడు. ఫుట్‌బాల్‌పై ఉన్న ఇష్టంతో 2014లో ఇండియన్ సూపర్ లీగ్‌ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో గోవా జట్టులో కో పార్ట్‌నర్‌గా కూడా ఉన్నారు. కోహ్లీకి ఫాస్ట్‌ఫుడ్ అంటే చాలా ఇష్టమట. కానీ ఫిట్‌నెస్ కారణంగా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తినరు. కోహ్లీ పూర్తిగా శాఖాహారి. సచిన్ టెండూల్కర్‌ను చూసి స్ఫూర్తి చెందానని గతంలో చాలా సార్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. 

GBIcHa_aoAA0WIf

ఇది కూడా చూడండి: నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. సర్వేలు ఏం చెబుతున్నాయంటే?

 2006లో తమిళనాడులో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ  అరంగేట్రం చేశాడు. ఈ మొదటి మ్యాచ్‌లో కోహ్లీ 10 పరుగులు చేశాడు. క్రికెట్ ప్రపంచంలో ఎవరు బ్రేక్ చేయని రికార్డులను కోహ్లీ రికార్డులు సృష్టించాడు. ఆ తర్వాత మలేషియాలో జరిగిన అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో కెప్టెన్‌గా ఉంటూ.. మొత్తం ఆరు మ్యాచ్‌లలో 235 పరుగులు చేశాడు. 

FvV2OqTaMAEMa41

ఇది కూడా చూడండి:  Rangareddy District: బాలుడి ప్రాణం తీసిన స్కూల్ గేట్..

విరాట్ కోహ్లీ ఎక్కువగా ఫ్యామిలితో వెకేషన్స్‌కి వెళ్తుంటారు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి 2017లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వీరికి 2021లో వామిక అనే కుమార్తె జన్మించగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు పుట్టగా అకాయ్ అని నామకరణం చేశారు.   

FlX3N2qacAAsM9g

ఇది కూడా చూడండి: ఎండతో నడిచే కారు.. ఒకసారి ఛార్జింగ్‌తో 1600KM..

Advertisment