BIG BREAKING: మనుబాకర్‌తో పాటు ఆ ముగ్గురికి ఖేల్ రత్న!

నలుగురు భారత క్రీడాకారులకు ఖేల్ రత్న అవార్డులు ప్రకటించింది కేంద్రం. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్, ఒలింపిక్ విజేత షూటర్ మనుబాకర్, హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ కు జనవరి 17న రాష్ట్రపతి భవన్‌లో ప్రదానం చేయనున్నారు. 

New Update
khel ratna

khel ratna awards 2024

Khel Ratna: నలుగురు భారత క్రీడాకారులకు ఖేల్ రత్న అవార్డులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్, ఒలింపిక్ విజేత షూటర్ మనుబాకర్, హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్, అథ్లెట్ ప్రవీణ్ కుమార్ కు ఈ పురష్కారాలను ప్రధానం చేయనున్నారు. భారత క్రీడాకారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే  2024 మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారాలు జనవరి 17న రాష్ట్రపతి భవన్‌లో ప్రదానం చేయనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ తెలిపింది. 

రాష్ట్రపతి చేతుల మీదుగా..

జనవరి 17న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారాలింపియన్ ప్రవీణ్ కుమార్, చెస్‌ క్రీడాకారుడు డి.గుకేశ్‌,  షూటర్‌ మను భాకర్‌ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డును అందుకోనున్నారు. ఇక కమిటీ సిఫార్సుల మేరకు ఈ క్రీడాకారులతోపాటు కోచ్‌లు, విశ్వవిద్యాలయాలు, పలు సంస్థలకు అవార్డులు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

అర్జున, ద్రోణాచార్య అవార్డ్స్..

అలాగే జనవరి 17న ఖేల్ రత్నతోపాటు అర్జున అండ్ ద్రోణాచార్య అవార్డులను అందజేసే అథ్లెట్ల జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ  ప్రకటించింది. నలుగురికి ఖేల్ రత్న అవార్డును అందజేయనుండగా, 32 మంది అథ్లెట్లు అర్జున అవార్డును, ముగ్గురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డును అందుకోనున్నారు. 

ఇది కూడా చదవండి: Gujarat: ప్రముఖ క్రికెటర్లకు సీఐడీ సమన్లు?

ఇక మొదట్లో ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన వారి జాబితాలో మనుభాకర్‌ పేరు లేకపోవడంపై వివాదం చెలరేగింది. మనుబాకర్ తండ్రి, కోచ్ జస్పాల్ రాణా తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. ఒలింపిక్ పతకాలు సాధించిన తర్వాత కూడా క్రీడా అధికారులు ఆమెను నామినేట్ చేయలేదని విమర్శించారు. మను తండ్రి రామ్ కిషన్ భాకర్ కూడా తన కుమార్తెను షూటర్‌గా కాకుండా క్రికెటర్‌గా చేసి ఉండాల్సిందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు