జో రూట్ దండయాత్ర.. సచిన్, సెహ్వాగ్, కుక్ రికార్డులు బ్రేక్!

ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ టెస్టు క్రికెట్‌లో రికార్డులు నెలకొల్పుతున్నాడు. పాక్‌తో తొలి టెస్టులో 262 పరుగులు చేసిన రూట్.. అత్యధిక 250+స్కోరు చేసిన మూడో ఇంగ్లాండ్ బ్యాటర్‌గా నిలిచాడు. సెహ్వాగ్‌ తర్వాత పాక్‌పై రెండోసారి 250+ పరుగులు చేసిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. 

dtete e
New Update

Joe Root : టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ దండయాత్ర కొనసాగుతోంది. పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేస్తున్న రూట్ తాజాగా డబుల్ సెంచరీతో చెలరేగి మరిన్ని రికార్డుల తిరగరాశాడు. ఇప్పటికే ఇంగ్లాండు తరఫున అత్యధిక పరుగుల్లో మాజీ ఆటగాడు అలిస్టర్ కుక్‌ (12,472)ను అధిగమించిన రూట్‌.. ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి అత్యధిక 250+ స్కోరు చేసిన మూడో బ్యాటర్‌గానూ నిలిచాడు. అంతేకాదు పాకిస్థాన్ జట్టుపై ఈ మార్క్‌ సాధించిన తొలి ఇంగ్లాండ్, రెండో అంతర్జాతీయ బ్యాటర్‌ గా అవరించాడు. ఈ మేరకు తొలి టెస్టులో 262 పరుగులు చేసిన జో రూట్.. సెహ్వాగ్‌ తర్వాత పాక్ పై రెండోసారి 250+ పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. 

మరో కొన్ని రోజుల్లోనే రికార్డులు బద్దలు..

ఇక జో రూట్ ఆటపై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరో కొన్ని రోజుల్లోనే రికార్డులు బద్దలు కాబోతున్నాయంటూ కామెంట్స్ చేస్తు్న్నారు. ఇందులో భాగంగానే ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కుక్ మాట్లాడుతూ.. 'నా రికార్డు బ్రేక్‌ అవుతుందని ముందే అనుకున్నా. కెప్టెన్ బాధ్యతల వల్ల రూట్ పరుగుల దాహాం తీర్చుకోలేకపోయాడు. బెన్ స్టోక్స్ రాకతో రూట్‌కు స్వేచ్ఛ దొరికింది. సచిన్‌ అత్యధిక పరుగుల రికార్డు కూడా రూట్ బ్రేక్ చేస్తాడు. రాబోయే మూడేళ్లు అతనికి అత్యంత కీలకం' అంటూ తన అభిప్రాయం వెల్లడించాడు. 

టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో..

ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 823/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోరు. కాగా హ్యారీ బ్రూక్‌ (317; 322 బంతుల్లో 29 ఫోర్లు, 3 సిక్స్‌లు) ట్రిపుల్ సెంచరీ, జో రూట్ (262; 375 బంతుల్లో 17 ఫోర్లు) డబుల్ సెంచరీ చేశారు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 267  పరుగుల ఆధిక్యంలో నిలిచింది. పాకిస్థాన్‌ 556 పరుగులకు ఆలౌటైంది.

Also Read :  రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్.. దేశం గురించి ఆయన ఏమన్నారంటే ?

#england #sehwag #sachin #Joe Root
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe