IND vs WI : అరుదైన రికార్డును సమం చేసిన బుమ్రా

భారత్, వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్‌లో జరుగుతున్న మొదటి టెస్ట్ మొదటి రోజు ఆటలో బుమ్రా అరుదైన రికార్డు సృష్టించాడు. సొంతగడ్డపై అతి తక్కువ బంతుల్లో 50 టెస్ట్ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.

New Update
buramha

భారత్, వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్‌లో జరుగుతున్న మొదటి టెస్ట్ మొదటి రోజు ఆటలో బుమ్రా అరుదైన రికార్డు సృష్టించాడు. సొంతగడ్డపై అతి తక్కువ బంతుల్లో 50 టెస్ట్ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి బుమ్రాకు కేవలం 1747 బంతులు మాత్రమే అవసరమయ్యాయి.బుమ్రా అదనంగా మరో రికార్డును కూడా సమం చేశాడు.  అతి తక్కువ ఇన్నింగ్స్‌లు సొంతగడ్డపై 50 వికెట్లు తీయడానికి బుమ్రా కేవలం 24 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఈ ఘనతతో అతను దిగ్గజ పేసర్ జవగల్ శ్రీనాథ్‌తో సమానంగా నిలిచాడు.కపిల్ దేవ్ (25 ఇన్నింగ్స్‌లు), ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీ (27 ఇన్నింగ్స్‌లు)లలో ఈ ఘనత సాధించారు. 

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌.. భారత బౌలర్లు చెలరేగడంతో 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్‌ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్‌ (6.1-0-25-2), వాషింగ్టన్‌ సుందర్‌ (3-0-9-1) ధాటికి విండీస్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది.  ఇక భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.  యశస్వి జైస్వాల్‌ (36), సాయి సుదర్శన్‌ (7) ఔట్‌ కాగా.. కేఎల్‌ రాహుల్‌ (53), శుభ్‌మన్‌ గిల్‌ (18) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 41 పరుగులు వెనుకపడి ఉంది.

 మహ్మద్‌ సిరాజ్‌ అరుదైన రికార్డు

మరో టీమిండియా బౌలర్  మహ్మద్‌ సిరాజ్‌ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2025 క్యాలెండర్‌ ఇయర్‌లో ఇప్పటి వరకు ఏకంగా 31 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతానికి ఈ జాబితాలో టాప్‌ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ లిస్టులో ఆసీస్‌ బౌలర్లైన మిచెల్‌ స్టార్క్‌ (29 వికెట్లు), నాథన్‌ లైయన్‌ (24), కరేబియన్‌ బౌలర్‌ షామర్‌ జోసెఫ్‌ (22)ను  సిరాజ్ అధిగమించాడు.

Advertisment
తాజా కథనాలు