SRH vs RR: రూ.11 కోట్లకు న్యాయం చేశాడు..రాజస్థాన్ బౌలర్లను ఊతికారేశాడు!

రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న తొలి ఐపీఎల్ మ్యాచ్ లో సన్రైజర్స్ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ రెచ్చిపోయి మరీ ఆడి సెంచరీ బాదాడు. ఫోర్లు, సిక్సర్లతో దంచికొడుతూ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో సన్రైజర్స్ 286 పరుగులు చేసింది.

New Update
ishan kishan  srh

ఉప్పల్ స్డేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న తొలి ఐపీఎల్ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు రెచ్చిపోయి మరీ ఆడారు.  ఫోర్లు, సిక్సర్లతో దంచికొడుతూ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది సన్రైజర్స్. ముందుగా టాస్  ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్రైజర్స్ కు ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరు దూకుడుగానే ఆడారు. ఈ క్రమంలో అభిషేక్‌ శర్మ (24)ను మహీష్‌ తీక్షణ ఔట్ చేశాడు. దీంతో సన్రైజర్స్ మొదటి వికెట్ కోల్పోయింది.  

 ట్రావిస్ హెడ్‌ హాఫ్ సెంచరీ

అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్‌ కిషన్‌ తో కలిసి ట్రావిస్ హెడ్‌ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే అతను హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, మూడు సిక్సులున్నాయి. 67పరుగుల వద్ద ట్రావిస్ హెడ్‌ ..  తుషార్‌ దేశ్‌ పాండే బౌలింగ్‌లో హిట్‌ మేయర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో వీరి 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 

ఇషాన్‌ కిషన్‌ సెంచరీ

అనంతరం క్రీజులోకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి(30)తో కలిసి ఇషాన్‌ కిషన్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.  వచ్చిన బంతిని వచ్చినట్లుగా బౌండరీకి పంపుతూ అభిమానులను హోరెత్తించాడు.  కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తరువాత మరింత రెచ్చిపోయి ఆడాడు. అతనికి తోడుగా నితీష్ కుమార్ రెడ్డి కూడా జట్టు స్కోర్ ను పరుగులు పెట్టించాడు. దీంతో  సన్రైజర్స్ 15 ఓవర్లకే 200 స్కోరును దాటేసింది. మంచి జోష్ లో ఉన్న నితీష్ కుమార్..  మహీష తీక్షణ బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మరోపక్కా ఇషాన్ కిషాన్ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా దూకుడుగా ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు,  6 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో హెన్రిచ్‌ క్లాసెన్‌ (34 ) వీరోచిత ఇన్నింగ్స్ ఆడటంతో సన్రైజర్స్ 286 పరుగులు చేసింది.  రాజస్థాన్ రాయల్స్ తరఫున తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు తీయగా, మహీష్ తీక్షణ రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా ఐపీఎల్ 2025 వేలంపాటలో ఇషాన్ కిషన్ ను సన్రైజర్స్ రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

Also read :  NZ vs PAK : ఇజ్జత్ తీసుకున్న పాక్.. సిరీస్ గోవిందా గోవింద!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు