IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలంపై ఉత్కంఠ నెలకొంది. ఆటగాళ్ల రిటెన్షన్ లిస్ట్ విడుదలైనప్పటినుంచి ఫ్రాంఛైజీలతోపాటు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే పలు జట్లు తమ కెప్టెన్లను వదులుకోగా.. నెక్ట్స్ ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించబోతున్నరనేది చర్చనీయాంశమైంది. ఇందులో ముఖ్యంగా ఢిల్లీ పంత్ ను వదిలిపెట్టగా నెక్ట్స్ ఎవరు కెప్టెన్ అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ అప్ డేట్ చక్కర్లు కొడుతోంది. గత సీజన్‌లో కోల్‌కతాను ఛాంపియన్‌గా నిలిపిన టీమ్‌ఇండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.
కెప్టెన్ బాధ్యతల ఇస్తామని హామీ..
ఈమేరకు ఢిల్లీ కాపిటల్స్ సహ యజమాని జీఎంఆర్ గ్రూప్ అతడిని జట్టులోకి తీసుకుని, కెప్టెన్ బాధ్యతల ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వేలంలో తామే తీసుకుంటామని, తమ వద్దనున్న రూ.73 కోట్లలో ఎక్కువ మొత్తం శ్రేయస్ కోసం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాత్రం.. శ్రేయాస్ కు ఏ ఫ్రాంచైజీకి మధ్య పరస్పర ఒప్పందం కుదరలేదంటున్నాడు. తొలి రిటెన్షన్‌గా తాము అనుకున్నప్పటికీ అది సాధ్యపడలేదన్నాడు. వేలంలోకి వెళ్లేందుకే శ్రేయస్ నిర్ణయం తీసుకున్నట్లు వెంకీ చెప్పారు. ఇక ఈ ఐపీఎల్ 2025 రిటెన్షన్‌లో ముగ్గురు కెప్టెన్లు మెగా వేలంలో నిలవనున్నారు. శ్రేయస్, రిషభ్ పంత్, కే ఎల్ రాహుల్ ఉన్నారు.