IPL 2025 : ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్.. జాక్ పాట్ కొట్టేది ఎవరు?

ఐపీఎల్ వేలం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో 204 మంది క్రికెటర్లను మాత్రమే కొనుక్కోవడానికి వీలుంది. వీళ్ళలో ఎక్కువ మొత్తానికి ఆటగాళ్ల జాబితాలో అర్ష్‌దీప్, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు. వేలంలో అందరికన్నా ఆసక్తిరేపుతున్న ఆటగాడు రిషబ్‌ పంత్‌.

ipl
New Update

క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ వేలం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగే ఈ మెగా ఆక్షన్ కు 577 మంది ఆటగాళ్లు వేలానికి వెళ్లనున్నారు. ఇందులో 366 మంది భారతీయులు కాగా.. 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉండటం గమనార్హం. 

కాగా ఈ సీజన్ లో  204 మంది క్రికెటర్లను మాత్రమే కొనుక్కోవడానికి వీలుంది. కనీస ధర రూ.2 కోట్లుగా ఉన్న జాబితాలో 81 మంది ఆటగాళ్లున్నారు. వీళ్ళలో ఎక్కువ మొత్తానికి ఆటగాళ్ల జాబితాలో అర్ష్‌దీప్, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌ ఉంటారు. ఫాస్ట్‌బౌలర్లకు మంచి డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో.. 96 అంతర్జాతీయ టీ20 వికెట్లు ఖాతాలో ఉన్న అర్ష్‌దీప్‌ సింగ్‌ కోసం పలు ఫ్రాంఛైజీలు పోటీ పడే అవకాశముంది. 

ఇది కూడా చదవండి: BREAKING: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

బ్యాటర్లు కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌లూ ఆసక్తిరేపుతున్నారు. శ్రేయస్‌ను దిల్లీ, రాహుల్‌ను కోల్‌కతా కెప్టెన్లుగా నియమించుకోవాలని భావిస్తున్నాయని తెలుస్తోంది. వేలంలో అందరికన్నా ఆసక్తిరేపుతున్న ఆటగాడు రిషబ్‌ పంత్‌. దిల్లీ క్యాపిటల్స్‌ను వీడి వేలానికి వచ్చిన పంత్ కోసం గట్టి పోటీ ఉండబోతుంది. అయితే ఈ పోటీ నేపథ్యంలో పంత్‌కు భారీ ధర పలకడం ఖాయంగా కనిపిస్తుండగా.. అది ఎన్ని కోట్ల వరకు ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

వేలానికి రూ.641కోట్లు..

వేలంలో ఆటగాళ్లను కొనుక్కోవడానికి మొత్తం పది ఫ్రాంఛైజీల వద్ద రూ.641.5 కోట్లు ఉన్నాయి. అత్యధికంగా రూ.110.50 కోట్లతో పంజాబ్‌ కింగ్స్‌ వేలంలో వేటకు సిద్ధమైంది. రూ.83 కోట్లతో బెంగళూరు, రూ.73 కోట్లతో దిల్లీ క్యాపిటల్స్‌తో వేలంలో పాల్గొననున్నాయి. గుజరాత్‌ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ చెరో రూ.69 కోట్లతో సిద్ధమయ్యాయి. అత్యల్పంగా రాజస్థాన్‌ రాయల్స్‌ వద్ద రూ.41 కోట్లు మాత్రమే ఉన్నాయి. కోల్‌కతా వద్ద రూ.51 కోట్లు.. ముంబయి, సన్‌రైజర్స్‌ చేతిలో చెరో రూ.45 కోట్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Balayya : రామ్ చరణ్ ను ఫాలో అవుతున్న బాలయ్య.. వర్కౌట్ అవుతుందా?

#ipl-2025
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe