/rtv/media/media_files/2025/07/11/radhika-yadav-2025-07-11-19-54-50.jpg)
టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఛాతిలో నాలుగు బుల్లెట్లు దిగాయని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. FIRలో మాత్రం వెనుక నుంచి కాల్చినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. బుల్లెట్లను ఛాతి నుంచి తొలగించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు వైద్యులు. అయితే రాధిక యాదవ్‌ను వెనుక నుంచి కాల్చానని ఆమె తండ్రి దీపక్ యాదవ్ చెబుతున్నారు. దీపక్ యాదవ్ చెప్పినదానికి విరుద్ధంగా పోస్టుమార్టం రిపోర్టు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
We need more people like Deepak Yadav. Why ...Just read till last
— Adarsh Kashyap (@i_adarshkashyap) July 11, 2025
Radhika Yadav's father was not of low, regressive thinking or a patriarchal mindset.
He always supported her.
He spent ₹2.5 crore on her tennis training.
Radhika Yadav studied at Scottish High International…
జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్ అయిన రాధిక యాదవ్.. గురువారం ఉదయం తండ్రి దీపక్ యాదవ్ చేతిలో హతమైంది. టెన్నిస్ అకాడెమీ కోసం కూతురికి రూ. 2 కోట్లు ఇచ్చారు దీపక్ యాదవ్. అయితే టెన్నిస్ అకాడెమీ మూసివేయాలంటూ కూతురిని పలుమార్లు ఆయన గొడవకు దిగారు. ఈ గొడవే ఆమె హత్యకు దారి తీసిందని తెలుస్తోంది.తమ కుమార్తె సంపాదనపై ఆధారపడి జీవిస్తున్నాడని బంధువులు, ఇతరులు దీపక్ యాదవ్ హేళన చేయడంతో అతను అభద్రతాభావానికి గురయ్యాడని పోలీసుల విచారణలో తేలింది.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఆమె ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించడం కూడా ఒక కారణం అని కొన్ని నివేదికలు పేర్కొన్నప్పటికీ, పోలీసులు మాత్రం టెన్నిస్ అకాడమీ వివాదమే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. గురుగ్రామ్‌లోని సుశాంత్ లోక్ ఫేజ్-2లో ఉన్న వారి నివాసంలో రాధిక వంట చేస్తుండగా, ఆమె తండ్రి దీపక్ యాదవ్ తన లైసెన్స్ పొందిన రివాల్వర్‌తో ఆమెపై కాల్పులు జరిపాడు. మూడు బుల్లెట్లు ఆమెకు తగిలి అక్కడికక్కడే మరణించింది. దీపక్ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేయగా కోర్టు ఒక రోజు పోలీసు కస్టడీకి అప్పగించింది. . ఆమె మరణం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.