Prithvi Shaw : టాలీవుడ్ బ్యూటీతో పృథ్వీ షా ఎంగేజ్మెంట్..  ఎవరీ ఆకృతి అగర్వాల్?

క్రికెట్ లవర్స్‌కు మరో గుడ్ న్యూస్. టీమ్ ఇండియా ఓపెనర్ పృథ్వీ షా తన లైఫ్‌లో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. సోషల్ మీడియా సెన్సేషన్, నటి ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా నిశ్చితార్థం ఘనంగా జరిగింది

New Update
Prithvi Shaw

క్రికెట్ లవర్స్‌కు మరో గుడ్ న్యూస్.  టీమ్ ఇండియా ఓపెనర్ పృథ్వీ షా తన లైఫ్‌లో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. సోషల్ మీడియా సెన్సేషన్, నటి ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా నిశ్చితార్థం ఘనంగా జరిగింది.  గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నా, ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, తాజాగా తన ప్రియురాలు ఆకృతి అగర్వాల్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు పృథ్వీ షా సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇటీవల అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో ఈ జంట కలిసి సందడి చేయడంతోనే వీరి పెళ్లిపై అందరికీ క్లారిటీ వచ్చేసింది.

ఎవరీ ఆకృతి అగర్వాల్?

షా మనసు దోచుకున్న ఆకృతి అగర్వాల్ కేవలం క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే కాదు, ఆమె ఒక పెద్ద డిజిటల్ సెలబ్రిటీ.ఈమె పెద్ద సోషల్ మీడియా స్టార్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఏకంగా 3.4 మిలియన్ల (34 లక్షల) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్‌లోనూ ఆమె వీడియోలకు భీభత్సమైన క్రేజ్ ఉంది. లాక్‌డౌన్ సమయంలో టిక్‌టాక్ వీడియోలతో పాపులర్ అయిన ఆకృతి, ఆ తర్వాత ఇన్‌స్టాలో ఫ్యాషన్, లైఫ్ స్టైల్, డ్యాన్స్ రీల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం ఇన్ఫ్లుయెన్సర్‌గానే కాకుండా నటిగా కూడా ఆమె రాణిస్తోంది. 

రాజేష్ నాయుడు దర్శకత్వంలో వస్తున్న త్రిముఖ అనే తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ఆమె హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఆకృతి సొంతూరు ఉత్తరప్రదేశ్‌లోని లక్నో. హైస్కూల్ చదువుతున్న సమయంలోనే వాళ్ల ఫ్యామిలీ ముంబైకి షిఫ్ట్ అయ్యింది. ముంబైలోని నిర్మల మెమోరియల్ ఫౌండేషన్ కాలేజ్ నుండి ఆమె మేనేజ్మెంట్ స్టడీస్ (BMS) లో డిగ్రీ పూర్తి చేసింది. చదువుతో పాటు గ్లామర్ ఫీల్డ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది.

2018లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు  పృథ్వీ షా. తన మొదటి టెస్ట్‌లోనే సెంచరీ సాధించి, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడైన భారతీయ ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. సెకండ్ సచిన్ టెండూల్కర్ అని కూడా ఫ్యాన్స్ పిలుచుకున్నారు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పృథ్వీ ఒక విధ్వంసకర ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. పవర్‌ప్లేలో బౌలర్లపై విరుచుకుపడుతూ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంలో అతను దిట్ట. ఒకే ఓవర్‌లో ఆరు బంతులకు ఆరు ఫోర్లు కొట్టిన రికార్డు కూడా ఇతని ఖాతాలో ఉంది.

ఫామ్ కోల్పోవడం, ఫిట్‌నెస్ సమస్యలు, డోపింగ్ వివాదం కారణంగా పృథ్వీ కొంతకాలం జట్టుకు దూరమయ్యాడు. అయితే, డొమెస్టిక్ క్రికెట్‌లో భారీ స్కోర్లు చేస్తూ తన సత్తా ఏంటో నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లోనూ సెంచరీలు బాది ఫామ్‌లోకి వచ్చాడు.

Advertisment
తాజా కథనాలు