India Vs Bangladesh:
అంతర్జాతీయ టెస్ట్ ర్యాకింగ్‌లో భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల సీరీస్‌లో రెండింటిలోనూ విజయం సాధించి..పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. ఇక రెండో టెస్ట్ మొదటి నుంచీ ఇంట్రస్టింగ్‌గా సాగింది. మొదటి రెండు రోజులు వర్షం కారణంగా అసలు ఆట సాగనేలేదు. మొదటి రోజు కేవలం 35 ఓవర్లు మాత్రమే పడ్డాయి. ఆ తరువాత ఆగిపోయింది. ఈ సమయంలో మ్యాచ్ డ్రా అవుతుంది అనుకున్నారు. కానీ మూడ రోజు నుంచీ భారత్ దూకుడుగా ఆడి ఆద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లా 233 పరుగులు చేయగా.. భారత్ 285/9 స్కోరు దగ్గరఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 146 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ 95 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ టెస్ట్ మ్యాచ్ మొత్తం టీమ్ ఇండియా టీ20 తరహా ఆటను ఆడింది. యశస్వి జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. రవిచంద్రన్ అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును అందుకున్నాడు.
రెండో మ్యాచ్ కూడా గెలిచిన భారత్...బంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్ట్‌ల సీరీస్ ను 2–0 తేడాతో ఎగురేసుకుపోయింది. మరోవైపు స్వదేశంలో భారత్ తిరుగులేని జట్టుగా నిలిచింది. సొంత దేశంలో వరుసగా 18 మ్యాచ్‌లు గెలిచి అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇక ఈ సిరీస్ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమ్‌ఇండియా టాప్ పొజిషన్‌ను సుస్థిరం చేసుకుంది. దాంతో పాటూ వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవడానికి మార్గం సుగమం చేసుకుంది. ఈ డబ్ల్యూటీసీలో భారత్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 8 విజయాలు, 2 ఓటములు, ఒక డ్రా ఉన్నాయి. ప్రస్తుతం భారత జట్టు PCT 74.27తో టాప్‌లో ఉంది.
Also Read: Israel: కాంకర్ ది గలీలీకి హెజ్బుల్లా ప్లాన్–ఇజ్రాయెల్