/rtv/media/media_files/2025/09/22/abhi-2025-09-22-00-06-57.jpg)
ఆసియా కప్ సూపర్ ఫోర్లో భాగంగా భారత్, పాక్ జట్లు దుబాయ్ వేదికగా మ్యాచ్ జరిగింది. ముందుగా టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పాక్ కెప్టెన్ కు ష్యేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మరోవైపు భారత్, పాకిస్తాన్ జట్లు రెండూ తమ తమ జట్లలో రెండు మార్పులు చేశాయి. అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా స్థానాలలో జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిని భారత్ జట్టులోకి తీసుకుంది. మరోవైపు పాకిస్తాన్ ఖుష్దిల్ షా, హసన్ నవాజ్ స్థానాలలో హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షాలను తీసుకువచ్చింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు ఈరోజు పేలవమైన ఫీల్డింగ్ తో పాక్ కు పరుగులు సమర్పించుకుంది. మూడు సార్లు క్యాచ్ లు మిస్ చేయడంతో పాక్ బ్యాటర్లు రెచ్చిపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ (58; 45 బంతుల్లో 5×4, 3×6) అర్ధశతకంతో రాణించాడు. ఫకార్ జమాన్ (15), సైమ్ అయూబ్ (21), నవాజ్ (21), ఫహీమ్ అష్రఫ్ (20*), సల్మాన్ (17*) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో శివమ్ దూబె 2 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్, కుల్దీప్ చెరో వికెట్ తీశారు.
ఇరగదీసిన టీమ్ ఇండియా బ్యాటర్లు..
దీని తరువాత బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా మొదటి నుంచే అటాకింగ్ కు దిగింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ , శుభ్ మన్ గిల్ లు టకాటకా రన్స్ చేశారు. వరుసగా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ వేగంగా పరుగులు చేశారు. పది ఓవర్లలో 100 పరుగులు దాటేసింది. కానీ తరువాత వరుసగా చాలా తక్కువ పరుగుల తేడాలోనే గిల్, కెప్టెన్ స్కై, అభిషేక్ శర్మ లు అవుట్ అయ్యారు. సూర్యకుమార్ అయితే అసలేమీ పరుగులు చేయకుండానే డకౌట్ గా వెనుదిరిగాడు. అభిషేక్ వర్మ 74 పరుగులు దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీని తరువాత మ్యాచ్ కాస్త నెమ్మదించింది. తిలక్ వర్మ, సంజూ శాంసన్ లు వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడారు. కానీ సంజూ వికెట్ కోల్పోయాడు. అయితే తిలక్ వర్మ బాగా ఆడడంతో మ్యాచ్ ఈజీగా గెలిచారు. చివర్లో ఒక సిక్స్, ఫోర్ తో మ్యాచ్ ను ఫినిష్ చేశాడు.