/rtv/media/media_files/2025/10/05/india-women-vs-pakistan-women-no-hand-shake-icc-womens-world-cup-2025-2025-10-05-15-30-17.jpg)
India Women vs Pakistan Women NO HAND SHAKE ICC Women's World Cup 2025
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో (indw vs pakw world cup 2025) భాగంగా ఇవాళ భారత్ VS పాకిస్తాన్ (INDW vs PAKW) మధ్య ఉత్కంఠభరితమైన పోరు ప్రారంభమైంది. శ్రీలంకలోని కొలంబోలో ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపడుతున్నాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా.. వన్డే ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన మొత్తం వన్డే మ్యాచ్‌ల్లో భారత్ ఒక్కసారి కూడా ఓడిపోలేదు.
indw vs pakw world cup 2025
దీంతో ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లో కూడా భారతే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో శ్రీలంకపై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 59 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీని విజయంతో ప్రారంభించిన భారత జట్టు మంచి ఊపులో ఉంది. మరోవైపు పాకిస్థాన్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఓటమి పాలైంది. దీంతో ఇప్పుడు భారత్‌తో జరుగుతోన్న మ్యాచ్ గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలని పాకిస్థాన్ మహిళల జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.
కాగా ఈ ప్రపంచ కప్‌ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నప్పటికీ.. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోని కొలంబో వేదికగానే ఏర్పాటు చేశారు. ఇవాళ్టి IND Vs PAK మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పురుషుల ఆసియా కప్‌లో భారత ఆటగాళ్లు పాకిస్థాన్ జట్టుతో హ్యాండ్ షేక్ చేయకపోవడం పెద్ద చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మహిళల జట్టు కూడా తాము కూడా తగ్గేదే లేదు అన్నట్లుగా ప్రవర్తించారు. పురుషుల ఆసియా కప్‌లో భారత జట్టు అనుసరించిన విధానాన్నే మహిళా జట్టు కూడా కొనసాగించింది.
भारतीय महिला क्रिकेट टीम की कप्तान हरमनप्रीत कौर ने पाकिस्तान की कप्तान से हाथ नहीं मिलाया टॉस के समय।
— Satish Mishra 🇮🇳 (@SATISHMISH78) October 5, 2025
जय हिन्द 🇮🇳
INDW vs PAKW | Harmanpreet Kaurpic.twitter.com/Jok0PBKtFm
2025 మహిళల ప్రపంచ కప్ లోనూ నో హ్యాండ్ షేక్ వివాదం బయటపడింది. టీం ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాతో కరచాలనం చేయడానికి నిరాకరించింది. 2025 ఆసియా కప్ నుంచి చర్చనీయాంశంగా మారిన నో హ్యాండ్ షేక్ వివాదం ఇప్పుడు మహిళల ప్రపంచ కప్ కు కూడా వ్యాపించింది.
ఆసియా కప్ 2025లో హ్యాండ్ షేక్ వివాదం
గత ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ పురుషుల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల సందర్భంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో, మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ చేయలేదు. ఫైనల్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి కూడా నిరాకరించారు. ఈ సంఘటనల నేపథ్యంలోనే బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) మహిళా జట్టుకు కూడా ఈ ‘నో హ్యాండ్‌షేక్’ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం.