Gautam Gambhir: వారందరినీ గౌతమ్ గంభీర్ తొక్కేశాడు.. దక్షిణాఫ్రికాతో ఓటమిపై ఫ్యాన్స్ ఫైర్

భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.

New Update
team india loss the 1st test fans fire on coach Gautam Gambhir

team india loss the 1st test fans fire on coach Gautam Gambhir

భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో దక్షిణాఫ్రికా 1-0 తేడాతో ముందంజలో ఉంది. 

Gautam Gambhir

తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ జట్టు ఓటమిపాలైన తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్‌ల వర్షం కురుస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్ గంభీర్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ముగ్గురు ఆల్ రౌండర్లు, ముగ్గురు బౌలర్లను రంగంలోకి దించింది. అప్పటి నుంచే గంభీర్‌పై అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. 

గంభీర్ తీసుకున్న నిర్ణయంపై క్రికెట్ ప్రియులు మండిపడుతున్నారు. గత మ్యాచ్‌లలో అద్భుతమైన ప్రదర్శన చేసిన సాయి సుదర్శన్‌ను.. కోచ్ గంభీర్ పక్కనపెట్టి వాషింగ్టన్ సుందర్‌ను నంబర్ త్రీలో ఆడించడంపై కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. జట్టులో గంభీర్ తరచుగా చేసే ఈ మార్పులపై కొందరు మండిపడుతున్నారు. ఫాస్ట్ బౌలర్ షమీని దూరం చేశారని.. శ్రేయాస్ అయ్యార్, సర్ఫరాజ్ ఖాన్ వంటి స్టార్ బ్యాటర్లకు అవకాశం ఇవ్వలేదని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వారి కామెంట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. 

Advertisment
తాజా కథనాలు