India Vs Pakistan: ఫ్లైట్ లో పాక్ గడ్డపై టీమిండియా.. అదిరిపోయే ఐడియా!

ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత్‌ జట్టు పాకిస్థాన్‌లోని లాహోర్‌ వేదికగా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పాక్ లో అడుగుపెట్టేందుకు ఇండియా ఎప్పుడూ ఇష్టంగా ఉండదు. దీంతో పాకిస్థాన్‌ భారత్‌ క్రికెట్‌ బోర్డుకు ఓ ఐడియా ఇచ్చింది. ఆ ఐడియా ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి..

New Update

India Vs Pakistan: అది నవంబర్ 26, 2008.. ఇండియా అంతా నిర్ఘాంతపోయింది. ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమానికి ముంబై విలవిల్లాడింది. ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం పది మంది ఉగ్రవాదులు దేశ ఆర్ధిక రాజధానిలో మరణమృదంగం సృష్టించారు. 166 మంది ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన అది. ఈ దాడి వెనుక ఉన్నది పాకిస్థాన్‌ ఉగ్రవాదులే కావడంతో ఆ దేశంతో దాదాపు అన్నీ సంబంధాలను ఇండియా తెగదెంపుకుంది. అందులో క్రికెట్‌ కూడా. నాటి ముంబై ఘటన తర్వాత భారత్ క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో అడుగుపెట్టింది లేదు.. అయితే రానున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Trophy 2025) షెడ్యూల్‌ ప్రకారం భారత్‌ జట్టు పాకిస్థాన్‌లోని లాహోర్‌ వేదికగా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే పాకిస్థాన్‌లో అడుగుపెట్టేందుకు ఇండియా ఎప్పుడూ ఇష్టంగా ఉండదు.. అందుకే ఈ సారి పాకిస్థాన్‌ భారత్‌ క్రికెట్‌ బోర్డుకు ఓ ఐడియా ఇచ్చింది. ఇంతకీ ఏంటా ఐడియా? బీసీసీఐ దానికి ఒప్పుకుంటుందా?

Also:  తెలంగాణలో కొత్త టీచర్లలో 47శాతం మహిళలే!

ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు..

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది, లాహోర్, రావల్పిండి, కరాచీలో మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. అయితే భారత సరిహద్దుకు సమీపంలో ఉండే లాహోర్‌ స్టేడియంలో ఇండియా ఆడే మ్యాచ్‌లు పెట్టాలని పాక్‌ భావిస్తోంది. టోర్నమెంట్‌లో టీమిండియా మూడు గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లను ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌పై, ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌పై, మార్చి 2న న్యూజిలాండ్‌పై భారత్ జట్టు ఆడాల్సి ఉంది. 

Also Read: వయనాడ్‌లో ఖుష్బూ కాదు.. బీజేపీ అభ్యర్ధి నవ్య హరిదాస్

భారత జట్టు న్యూ ఢిల్లీ లేదా చండీగఢ్ లేదా మొహాలీలో క్యాంప్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని పాక్‌ అంటోంది.  వారి మ్యాచ్‌ల కోసం లాహోర్‌కు వెళ్లేందుకు చార్టర్డ్ ఫ్లైట్‌లను ఉపయోగించవచ్చని పీసీబీ బీసీసీఐకి సూచించినట్టుగా ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే నివేదించింది. అయితే ఇదంతా రాతపూర్వకంగా జరగలేదు. నోటి మాటగానే బీసీసీఐకి పీసీబీ ఇలా సూచించినట్టు సమాచారం. అయితే పాకిస్థాన్‌లో భారత్ ఆడినా ఆడకపోయినా ఫైనల్‌ను లాహోర్‌లోనే నిర్వహించాలని పీసీబీ పట్టుదలగా ఉందట. మరోవైపు ఇంటర్నెషనల్‌ క్రికెట్ కౌన్సిల్‌-ICC మాత్రం ఛాంపియన్స్‌ ట్రోఫి మ్యాచ్‌లను హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించాలని భావిస్తోంది. దుబాయ్ , శ్రీలంక లాంటి ప్రత్యామ్నాయ వేదికలను పరిశీలిస్తోంది.

Also Read: 'హైడ్రా ఆగదు.. అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదు' : సీఎం రేవంత్

నిజానికి పాక్‌-ఇండియా మధ్య రాజకీయ విభేదాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ టోర్నమెంట్ కోసం భారత్‌ పాకిస్తాన్‌కు వెళ్తుందా లేదా అన్నది అతిపెద్ద ప్రశ్న. 2023లో ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. దీంతో బీసీసీఐ తమ జట్టును పాక్‌కు పంపించేది లేదని చెప్పింది. దీంతో భారత్‌తో జరిగే మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యమివ్వాల్సి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఇలానే నిర్వహిస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. భారత్‌ జట్టు పాక్‌ ప్రయాణానికి సంబంధించిన తుది పిలుపును కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుంది.

భారత్‌ ఆటగాళ్లకు పాక్‌లో ప్రయాణించడం చాలా పెద్ద రిస్క్‌. అటు బైలెటరల్‌ సీరిస్‌ల షెడ్యూల్, ఆతిథ్యంపై BCCI-పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటివరకు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. వేదికలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర కార్యాచరణ అంశాలపై ఇరు బోర్డులు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో పాక్‌ ఉగ్రవాదుల దాడుల కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు భారత్‌ జట్టును అనుమతిస్తుందా అన్నది డౌటే.

Also Read: ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..మరికొన్నింటిపై తగ్గింపు

Advertisment
Advertisment
తాజా కథనాలు