/rtv/media/media_files/2025/01/23/LEGiaKzdVweigFOA0b8u.jpg)
ind vs eng match Photograph: (ind vs eng match)
భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జనవరి25వ తేదీన చెన్నైలో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ మ్యాచ్ టికెట్ ఉన్న వారికి మెట్రోలో ఫ్రీగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరగనుండగా.. స్టేడియానికి రావడానికి, వెళ్లడానికి మెట్రోలో టికెట్ అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే ఇలాంటి ఆఫర్లు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఇవ్వడం ఇదేం మొదటిసారి కాదు.
Plan your travel wisely for the India vs England 2nd T20I at Chepauk on January 25! 🇮🇳 🏴#TNCricket #TNCA #INDvENG #ChepaukStadium #TamilNaduCricket pic.twitter.com/bezEaE7Xqi
— TNCA (@TNCACricket) January 21, 2025
2023 ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలోనూ ఇలా మెట్రో టికెట్ ఫ్రీ ఆఫర్ కల్పించింది. 2024 సెప్టెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ తర్వాత చెన్నై వేదికగా తొలిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ జరగబోతుంది. 2023 ప్రపంచ కప్ తర్వాత చిదంబరం స్టేడియం మొదటిసారిగా వైట్-బాల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. చెపాక్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టిక్కెట్ల విక్రయాలు ఊపందుకున్నాయి. కాగా చెన్నైలో మ్యాచ్ తర్వాత రాజ్‌కోట్, పూణే, ముంబై వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మిగితా టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి.
అదరగొట్టిన టీమిండియా
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్ జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. మొదటి టీ20 మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ టీమ్ 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా12.5 ఓవర్లలోనే ఛేదించింది. అభిషేక్ శర్మను మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ వరించింది. 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు కొట్టి 79 పరుగులు చేసిన అభిషేక్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఇతని తర్వాత సంజూ శాంసన్ 20 బంతుల్లో 26 పరుగులు, తిలక్ వర్మ 16 బంతుల్లో 19 పరుగులు చేశారు.
ఇక ఈ మ్యాచ్‌లో యువ పేసర్ అర్ష్‌దీప్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బెన్ డకెట్‌ను ఔట్ చేసి.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ రికార్డులకెక్కాడు. అర్ష్‌దీప్ ఇప్పటి వరకు 61 టీ20 మ్యాచ్‌లు ఆడగ్గా 97 వికెట్లు తీశాడు. అయితే ఈ రికార్డు ఇంతకు ముందు భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మీద ఉంది. చాహల్ 80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో అర్షదీప్ సింగ్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ రోజు మ్యాచ్ లో భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.