Hockey: హ్యాట్రిక్ కొట్టారు..మహిళల ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ..

మహిళల ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో భారత్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో 13–0తో థాయ్ లాండ్‌ను చిత్తుగా ఓడించి సెమీ ఫైనల్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. అంతకు ముందు దక్షిణ కొరియా, మలేషియాలను ఓడించింది.

india
New Update

 Indian Hockey Team: 

హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జట్టు అదరగొడుతోంది. వరుసగా మ్యాచ్ లు కొట్టుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో మహిళల జట్టు సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. ఈ జట్టు ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. 

ఇక ఈ రోజు థాయ్ లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ మహిళలు చితక్కొట్టేశారు. 13 - 0 తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తుగా ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. దీంతో భారత్ సెమీ ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకుంది. అసలు మ్యాచ్ మొదటి నుంచీ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఇందులో అవతలి థాయ్‌లాండ్‌ టీమ్ ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయింది. మరవైపు మన భారత జట్టులో యువ స్ట్రైకర్ దీపిక  (3వ, 19వ, 43వ 45వ, 45వ నిమిషం) ఐదుసార్లు గోల్స్‌తో సత్తా చాటింది. ప్రీతి దూబే (9వ, 40వ), లాల్‌రెమ్‌సియామి (12, 56వ),  మనీషా చౌహాన్‌ (55వ, 58వ), తలో రెండు గోల్స్‌ చేశారు. బ్యూటీ  డంగ్‌డంగ్ (30వ), నవ్‌నీత్ కౌర్ (53వ) చెరో గోల్ సాధించారు. 

అంతకు ముందు భారత జట్టు మలేషియా, దక్షిణ కొరియాల మీద కూడా ఇదే ఆటను ప్రదర్శించింది. మలేషియాను 4–0తో, దక్షిణ కొరియాను 3–2 తేడాతో ఓడించింది. ఇప్పుడు సెమీ ఫైనల్స్‌లో భారత మహిళ జట్టు చైనాతో తలపడుతుంది. చైనా కూడా 2-1 తేడాతో జపాన్‌పై గెలిచింది. ప్రస్తుతం టోర్నీ పాయింట్ల పట్టికలో చైనా 9 పాయింంట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్‌ ఖాతాలో కూడా 9 పాయింట్లే ఉన్నప్పటికీ ఎక్కువ గోల్స్‌ ఉండటంతో చైనా టాప్‌లో నిలిచింది.

Also Read: Delhi: ఢిల్లీ కొత్త మేయర్‌‌గా ఆప్‌ నేత మహేశ్ ఖించి

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe