Delhi: ఢిల్లీ కొత్త మేయర్‌‌గా ఆప్‌ నేత మహేశ్ ఖించి

దేశ రాజధాని ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్‌ మహేశ్‌ కుమార్‌ ఖించి కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు.  కేవలం మూడు ఓట్ల తేడాతో ఆప్ ఈ విజయాన్ని సొంతం చేసుకుంది.

author-image
By Manogna alamuru
New Update
meyor

Delhi New Mayor: 

ఢిల్లీ మేయర్ ఎన్నికలు హోరా హోరీగా సాగాయి. ఆప్, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ సాగింది. కానీ చివరకు ఇందులో విజయం ఆప్ నే వరించింది.  దీంతో మ్ ఆద్మీ ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్‌ మహేశ్‌ కుమార్‌ ఖించి కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు. కరోల్‌బాగ్‌లోని దేవ్‌నగర్‌ కౌన్సిలర్‌గా  మహేశ్‌ ఖించి ఉన్నారు ఇతనికి మొత్తం 133 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 130 ఓట్లు వచ్చాయి. ఇద్దరికి మధ్య కేవలం 3 ఓట్లు మాత్రమే తేడా ఉంది.  దీంతో స్వల్ప మెజార్టీతో ఆప్‌ అభ్యర్థి నెగ్గినట్టయ్యారు. మొత్తంగా 265 ఓట్లు పోలవ్వగా.. రెండు ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి మూడో మేయర్‌గా మహేశ్‌ ఖించి రికార్డు సృష్టించారు.

ఇక మేయర్ ఎన్నికలను కాంగ్రెస్ బహిష్కరించింది. ఆ పార్టీకి చెందినకాంగ్రెస్ కౌన్సిలర్ సబిలా బేగమ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. మరోవైపు ఈ మేయర్ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే జరగాల్సి ఉన్నప్పటికీ.. ఆప్‌, బీజేపీ మధ్య గొడవలతో వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ఇప్పుడు కొత్త మేయర్‌ ఐదు నెలలు మాత్రమే ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: Boeing: బోయింగ్‌లో భారీగా ఉద్యోగాల తొలగింపు...17వేల మందిపై ఎఫెక్ట్

Advertisment
తాజా కథనాలు