ind vs wi ః తొలి టెస్ట్ ఫినీష్‌..వెస్టిండీస్ పై టీమిండియా భారీ విజయం

వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ను టీమిండియా సొంతం చేసుకుంది. ఈ తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు దుమ్ము దులిపేశారు. మూడు రోజుల్లో మ్యాచ్ ను ఫినిష్ చేసేశారు. 140 పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.

New Update
ind vs wi

ind vs wi

భారత్ vs వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్ ల సిరీస్‌లో మొదటి టెస్ట్ ముగిసింది. శుభ్‌మాన్ గిల్ కెప్టెన్సీలో భారత జట్టు అద్భుతమైన తొలి విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 140 పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అక్టోబర్ 2 నుండి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రెండు జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు దుమ్ము దులిపేశారు. కేవలం మూడే రోజుల్లో మ్యాచ్ ను ఫినిష్ చేసేశారు. ఈ గెలుపుతో టీమిండియా 1-0 తేడాతో ముందువరుసలో ఉంది. 

ind vs wi

ఈ మ్యాచ్‌లో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 448 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 286 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్సింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ బ్యాటర్లు మరోసారి చేతులెత్తేసారు. లంచ్ బ్రేక్ కు ముందే 66 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయారు. ఇక లంచ్ అనంతరం బ్యాటింగ్ దిగిన కరేబియన్స్ జట్టు.. కనీసం టీ బ్రేక్ వరకు క్రీజ్ లో నిలబడలేకపోయారు. 

వెస్టిండీస్‌ బ్యాటర్లలో అలిక్‌ అథనేజ్ 74 బంతుల్లో 38 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత జస్టిన్‌ గ్రీవ్స్‌52 బంతుల్లో 25 పరుగులు, జాన్‌ క్యాంప్‌బెల్‌ 32 బంతుల్లో 14 పరుగులు చేశారు. వీరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా వారంతా విఫలమయ్యారు. అదే సమయంలో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. రవీంద్ర జడేజా 4 వికెట్లు, మహ్మద్‌ సిరాజ్‌ 3వికెట్లు, కుల్‌దీప్‌ యాదవ్‌ 2 వికెట్లు, వాషింగ్టన్‌ సుందర్‌ ఒక వికెట్‌ తీసారు. 

ఇదిలా ఉంటే రెండో రోజు ఆటలో భారత బ్యాటర్లు విజృంభించారు. ఓపెనర్ కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, రవింద్ర జడేజా సెంచరీలతో మెరిసారు. కేఎల్ రాహుల్ 190 బంతుల్లో 100 పరుగులు, ధ్రువ్ జురేల్ 210 బంతుల్లో 125 పరుగులు చేయగా.. రవీంద్ర జడేజా 176 బంతుల్లో 104* పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

Advertisment
తాజా కథనాలు