Team India : 92 ఏళ్ల తరువాత అరుదైన రికార్డుకు అడుగు దూరంలో! భారత క్రికెట్ జట్టు 19న చెన్నైలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్టు ఆడబోతుంది.బంగ్లాతో జరిగే తొలి టెస్టులో గెలిస్తే, టెస్టు క్రికెట్‌లో ఓటముల కన్నా విజయాలను ఎక్కువగా అందుకున్న జట్టుగా టీమిండియా రికార్డుకు ఎక్కుతుంది. By Bhavana 14 Sep 2024 | నవీకరించబడింది పై 14 Sep 2024 11:36 IST in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Team India : 45 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు 19న చెన్నైలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్టు ఆడబోతుంది. దీనికోసం రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా శుక్రవారం చెన్నైలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో చిదంబరం స్టేడియంలో శిక్షణా కార్యక్రమంలో టీమిండియా పాల్గొంటుంది. కాగా, జులైలో రాహుల్ ద్రవిడ్ నుంచి ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గంభీర్ కి ఇదే తొలి టెస్టు కూడా. ఇదిలాఉంటే.. 1932లో తొలిసారిగా టెస్టు ఆడిన భారత్ ఇప్పటివరకు 579 మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో 178 మ్యాచుల్లో గెలిచింది. 178 మ్యాచుల్లో ఓడిపోయింది. మిగిలిన 223 మ్యాచుల్లో 222 టెస్టులు డ్రాగా ముగిసాయి. ఒక మ్యాచ్ టై అయింది. అంటే చెన్నై వేదికగా ఈ నెల 19 నుంచి బంగ్లాతో జరిగే తొలి టెస్టులో గెలిస్తే, టెస్టు క్రికెట్‌లో ఓటముల కన్నా విజయాలను ఎక్కువగా అందుకున్న జట్టుగా టీమిండియా రికార్డుకు ఎక్కుతుంది. ఇప్పటి వరకు ఈ రికార్డును భారత్ అందుకోలేకపోయింది. ఒకవేళ ఈ రికార్డును వచ్చే టెస్టులో సాధిస్తే 1932 తర్వాత ఇదే తొలిసారి గా రికార్టులు క్రియేట్ అవుతాయి. అంటే 92 ఏళ్లలో ఇదే తొలి సారి అవుతుంది. Also Read: సంక్రాంతి బండి..మొత్తం ఫుల్లండి! #team-india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి