/rtv/media/media_files/2025/11/10/ind-vs-sa-test-series-2025-2025-11-10-15-36-35.jpg)
ind vs sa test series 2025
టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. అయితే వచ్చే ఏడాది 2026 టీ20 ప్రపంచ కప్ టోర్నీ ఉండగా.. అంతకంటే ముందు భారత్, దక్షిణాఫ్రికాతో పలు సిరీస్‌లు ఆడనుంది. దీని కోసం దక్షిణాఫ్రికా జట్టు భారతదేశానికి వస్తోంది. ఈ పర్యటనలో భారతదేశం, దక్షిణాఫ్రికా జట్లు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు T20Iలు ఆడతాయి.
మొదటగా టెస్ట్ సిరీస్ ప్రారంభం అవుతుంది. ఇది నవంబర్ 14 శుక్రవారం నుంచి మొదలు కానుంది. ఈ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా జట్టుకు శుభ్‌మాన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌లో రిషభ్ పంత్ కూడా భాగం కానున్నాడు.
భారత్ vs దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్
భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ నవంబర్ 14న ప్రారంభమై నవంబర్ 26 వరకు కొనసాగుతుంది. మొదటి మ్యాచ్ కోల్‌కతాలో.. రెండవ మ్యాచ్ గౌహతిలో జరుగుతుంది.
టెస్ట్ సిరీస్ స్టేడియం, టైమింగ్స్
భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 14 నుండి 18 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.
రెండవ మ్యాచ్ నవంబర్ 22 నుండి 26 వరకు గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ ఉదయం 9:00 గంటలకు ప్రారంభమవుతుంది.
వన్డే సిరీస్ స్టేడియం, టైమింగ్స్
ఈ టెస్ట్ సిరీస్ తర్వాత టీం ఇండియా 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు కూడా ఆడనుంది. ఈ రెండింటిలో ముందుగా వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.
రెండో వన్డే రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్ విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.
T20 సిరీస్ స్టేడియం, టైమింగ్స్
మొదటి T20I - డిసెంబర్ 9న, కటక్‌లో ప్రారంభం కానుంది.
2వ T20I - డిసెంబర్ 11న న్యూ చండీగఢ్‌లో జరుగుతుంది.
3వ T20I - డిసెంబర్ 14న ధర్మశాలలో ఉంటుంది.
4వ T20I - డిసెంబర్ 17న లక్నోలో జరుగుతుంది.
ఐదవ T20I - డిసెంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ముగియనుంది.
Follow Us