IND Vs BAN : బ్యాటింగ్ కు దిగిన భారత్.. ఇరు జట్ల వ్యూహాలివే!

చైన్నైలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలుచుకున్న బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ లో శుభారంభం చేయాలన్న లక్ష్యంతో భారత్ బ్యాటర్లు బరిలోకి దిగారు. పాకిస్థాన్ ను ఇటీవల ఓడించిన జోష్ లో ఉన్న బంగ్లాదేశ్ అదే జోరును కొనసాగించాలని వ్యూహాలు రచిస్తోంది.

author-image
By Nikhil
New Update
Sports

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ బ్యాటింగ్ కు దిగారు. చెన్నైలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సీజన్‌ను శుభారంభం చేయాలన్న లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 13 టెస్టు మ్యాచ్‌లు జరగ్గా, అందులో భారత్ 11 మ్యాచ్‌లు గెలవగా, బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకోవడంలో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌లో భారత పర్యటనకు ఇది మూడోసారి. భారత్ తన గడ్డపై బంగ్లాదేశ్‌తో మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడగా మూడింటిలోనూ విజయం సాధించిన రికార్డు ఉంది. ఇటీవలే పాకిస్థాన్‌లో పాకిస్థాన్‌ను ఓడించి వస్తున్న బంగ్లాదేశ్ జట్టు ఇండియాతో జరిగే మ్యాచుల్లోనూ సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది.

Also Read :  ODI World Cup 2023 : భారత్‌కు 11,637 కోట్ల ఆదాయం.. 48 వేల ఉద్యోగాలు!

Also Read :  Vinesh Phogat: వినేశ్‌ ఫొగాట్‌ కేసులో ప్రభుత్వం మద్దతు ఇవ్వలేదు!

భారత జట్టు..

రోహిత్ శర్మ (Rohit Sharma) (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్ జట్టు..

షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహిద్ రాణా.

Also Read :  ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్న భారత్

Advertisment
తాజా కథనాలు