Ind Vs Ban: బంగ్లా ఆలౌట్.. భారత్ ముందు భారీ లక్ష్యం!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా 228 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇప్పుడు భారత్ 229 పరుగుల లక్ష్య ఛేదనకు సిద్ధమవుతోంది. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్, షమీ, హర్షిత్ రాణా అదరగొట్టేశారు.

New Update
ind vs ban live score

ind vs ban live score

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగింది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం అయింది. మొదట టాస్ గెలిచిన బంగ్లా.. బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆదిలోనే పేవల బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ ఓవర్‌లో మహ్మద్ షమ్మీ బౌలింగ్ చేయగా.. ఫస్ట్ వికెట్ కోల్పోయింది. అనంతరం రెండో ఓవర్‌లో హర్షిత్ రాణా వేయగా.. మరో వికెట్ కోల్పోయింది. 

దీంతో బంగ్లా కేవలం 100 పరుగులకే ఆలౌట్ అవుతుందని అంతా భావించారు. కానీ ఎవరూ ఊహంచని విధంగా బంగ్లా విధ్వంశమైన ఆట తీరు కనబరిచింది. కనీ వినీ ఎరుగని రీతిలో దుమ్ము దులిపేసింది. మొత్తంగా నిర్ణీత 49.4 ఓవర్లలో 228 పరుగులు సాధించి అబ్బురపరచింది. చివరికి ఆలౌట్‌గా నిలిచింది. భారత బౌలర్లలో మహ్మద్ షమ్మీ, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ అదరగొట్టేశారు. ఇప్పుడు భారత్ ముందు 229 పరుగుల లక్ష్యం ఉంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు