IND Vs AUS T20 Series: టీమిండియాలో భారీ మార్పులు.. ఆసీస్‌తో T20 ఆడే ఫైనల్ జట్టు ఇదే

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ తర్వాత, భారత్, ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్నాయి. టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు. తొలి మ్యాచ్‌కు భారత జట్టు ప్లేయింగ్ ఎలెవెన్‌లో పెద్ద మార్పు ఉంటుంది.

New Update
team india Major changes T20 squad against Australia

team india Major changes T20 squad against Australia

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ తర్వాత..  ఇప్పుడు భారత్ vs ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ అక్టోబర్ 29న జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ప్లేయింగ్ XIలో పెద్ద మార్పు జరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా బౌలింగ్ ఆర్డర్‌లో ఛేంజెస్ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. కుల్దీప్ యాదవ్‌ను మొదటి మ్యాచ్ నుండి తొలగించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్‌కు సంబంధించి ప్లేయింగ్ 11 గురించి తెలుసుకుందాం. 

2025 ఆసియా కప్‌లో శుభ్‌మన్ గిల్, అభిషేక్ సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే తొలి టీ20లో శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు భారత్ తరఫున ఓపెనర్లుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో అభిషేక్ శర్మ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఇదే మొదటిసారి.

ఇక మిడిల్ ఆర్డర్‌ విషయానికొస్తే.. సూర్యకుమార్ యాదవ్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. తిలక్ వర్మ, శివమ్ దూబే 4వ స్థానంలో బ్యాటింగ్‌ చేయగలరు. అంతేగాక శివమ్ దూబే, సంజు సామ్సన్ లోయర్ మిడిల్ ఆర్డర్‌లో కూడా రాణించగలరు. అక్షర్ పటేల్ ఫినిషర్ పాత్రను పోషించగలడు.

బౌలింగ్ విభాగంలో భారీ మార్పులు

బౌలింగ్ విభాగంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను మొదటి మ్యాచ్ నుంచే తొలగించే అవకాశం ఉంది. అతని స్థానంలో అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్షర్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా కీలక పాత్ర పోషించగలడు. ఇంకా వరుణ్ చక్రవర్తికి కూడా అవకాశం లభించే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్లలో, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఉంది.

మొదటి T20I కి భారత జట్టు

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

Advertisment
తాజా కథనాలు