/rtv/media/media_files/2025/11/02/ind-vs-aus-3rd-t20-match-1-2025-11-02-17-33-12.jpg)
IND VS AUS 3rd T20 Match
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో మూడవ మ్యాచ్ ఇవాళ (ఆదివారం) హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.3 ఓవర్లలో పూర్తి చేసింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ సిరీస్‌లోని నాల్గవ మ్యాచ్ నవంబర్ 6న జరుగుతుంది.
IND VS AUS 3rd T20
ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాట్సమెన్స్, బౌలర్స్ అదరగొట్టేశారు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, దుబే అదరగొట్టేశారు. ఇక బ్యాటింగ్‌లో వాషింగ్టన్ సుందర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు కూడా పర్వాలేదనిపించారు.
🏏𝐈𝐧𝐝𝐢𝐚 𝐯𝐬 𝐀𝐮𝐬𝐭𝐫𝐚𝐥𝐢𝐚 𝟑𝐫𝐝 𝐓𝟐𝟎𝐈 ||🏆
— All India Radio News (@airnewsalerts) November 2, 2025
India beat Australia by 5 Wickets
𝑭𝒊𝒏𝒂𝒍 𝑺𝒄𝒐𝒓𝒆:
🇦🇺AUS: 186-6(20)
🇮🇳IND: 188-5(18.3)
📍Bellerive Oval, Hobart#TeamIndia#AUSvIND#3rdT20Ipic.twitter.com/hwsKTk4tB5
ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆసీస్ ప్లేయర్లు క్రీజ్ లోకి వచ్చారు. మొదటి నుంచి దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ, ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. హెడ్ తక్కువ పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత మెల్లి మెల్లిగా వరుస వికెట్లు పడ్డాయి.
ఇలా ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 రన్స్ చేసింది. ఆసీస్ బ్యాటర్లలో టిమ్ డేవిడ్, మార్కస్ స్టాయినీస్ దుమ్ము దులిపేశారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. ట్రావిస్ హెడ్ 6 పరుగులు, మిచెల్ మార్ష్ 11 పరుగులు, జోష్ ఇంగ్లిస్ 1పరుగులు చేసి ఔట్ కాగా.. టిమ్ డేవిడ్ 38 బంతుల్లో 74 పరుగులు సాధించాడు. అందులో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అలాగే మార్కస్ స్టాయినిస్ 39 బంతుల్లో 64 పరుగులు చేశాడు. అందులో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, శివమ్ దూబె ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం 187 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ దుమ్ము దులిపేశాడు. అతడు 23 బంతుల్లో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి కీలక ఇన్నింగ్స్‌తో భారత్ ఘన విజయం సాధించింది. అతడి స్కోర్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. అలాగే తిలక్ వర్మ 29 పరుగులు, అభిషేక్ శర్మ 25 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 24 పరుగులు, జితేశ్ శర్మ 22*పరుగులు, అక్షర్ పటేల్ 17పరుగులు, శుభ్‌మన్ గిల్ 15 పరుగులు చేశారు.
Follow Us