/rtv/media/media_files/2025/10/23/ind-vs-aus-2nd-odi-live-updates-australia-won-the-toss-elected-to-bowl-2025-10-23-09-00-11.jpg)
ind vs aus 2nd odi live updates Australia won the toss elected to bowl.
భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌లో రెండవ మ్యాచ్ ఇవాళ అడిలైడ్ ఓవల్‌లో ప్రారంభమైంది. ఇందులో భాగంగా రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో అందరి దృష్టి రోహిత్, విరాట్ పైనే ఉన్నాయి. భారత సూపర్ స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గత మ్యాచ్ లో విఫలమైన విషయం తెలిసిందే. ఇప్పుడు కింగ్ కోహ్లీ, హిట్ మాన్ అడిలైడ్ ఓవల్ లో బ్యాట్ తో అద్భుతమైన ప్రదర్శన ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో ఆసీస్ జట్టు ప్లేయర్లలో మార్పులు చేర్పులు జరిగాయి.
ind vs aus 2nd odi
Even #RaviShastri is shocked by #TeamIndia's luck with the coin flip! 🤔
— Star Sports (@StarSportsIndia) October 23, 2025
Australia put #ShubmanGill & co to bat first. 🏏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniyltpic.twitter.com/A9ivrdMHeb
టీం ఇండియా ప్లేయింగ్ 11
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11
మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్‌లెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.
ఆస్ట్రేలియా మూడు ప్రధాన మార్పులు
ఆస్ట్రేలియా తమ ప్లేయింగ్ XIలో మూడు ప్రధాన మార్పులు చేసింది. మాథ్యూ కుహ్నెమాన్ స్థానంలో ఆడమ్ జంపా తిరిగి వచ్చాడు. జోష్ ఫిలిప్ స్థానంలో అలెక్స్ కారీ తిరిగి ప్లేయింగ్ XIలోకి వచ్చాడు. నాథన్ ఎల్లిస్ స్థానంలో జేవియర్ బార్ట్‌లెట్ వచ్చాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కోనోలీ, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్‌లెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్‌లను ప్లేయింగ్ XIలో చేర్చాడు.
Follow Us