Australia : వాటే బ్యాటింగ్.. పాక్ పై ఆస్ట్రేలియా ప్లేయర్ కుమ్మేసింది!

ఉమెన్స్ వరల్డ్ కప్ లో  ఆస్ట్రేలియా  స్టార్ ప్లేయర్ బెత్ మూనీ అదరగొట్టింది. పాకిస్తాన్ తో జరుగుతోన్న మ్యాచ్ లో  76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన క్రమంలో ఒంటరి పోరాటంతో సూపర్ సెంచరీ సాధించి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించింది.

New Update
aus (1)

ఉమెన్స్ వరల్డ్ కప్ లో  ఆస్ట్రేలియా  స్టార్ ప్లేయర్ బెత్ మూనీ అదరగొట్టింది. పాకిస్తాన్ తో జరుగుతోన్న మ్యాచ్ లో  76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన క్రమంలో ఒంటరి పోరాటంతో సూపర్ సెంచరీ సాధించి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించింది. కొలంబో వేదికగా పాకిస్తాన్ తో జరుగుతోన్న లీగ్ మ్యాచ్ లో  టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లు అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. 

76 పరుగులకే ఏడు వికెట్లు

ఓపెనర్లు అలీస్సా హిలీ (20), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (10) త్వరగానే వెనుదిరిగారు. దీంతో ఆస్ట్రేలియా 76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  ఇలాంటి సమయంలో  బెత్ మూనీ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించింది. 109 పరుగులు (114 బంతుల్లో, 11 ఫోర్లు) చేసి జట్టును ఆదుకుంది.చివర్లో అలానా కింగ్  కీలకమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 51 పరుగులు (49 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేసి నాటౌట్‌గా నిలిచింది. 

పాకిస్తాన్ తరఫున నష్రా సంధు మూడు వికెట్లు పడగొట్టగా, రమీన్ షమీమ్ రెండు వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్‌కు 50 ఓవర్లలో 222 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. 222 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన పాక్ కూడా కష్టాల్లో పడింది. 55 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. సిద్రా అమీన్(25), రమీన్ షమీమ్(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Advertisment
తాజా కథనాలు