BREAKING: ప్రముఖ టెన్నిస్‌ దిగ్గజం తండ్రి కన్నుమూత!

టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తండ్రి వేస్ పేస్ (80) గురువారం కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలం నుంచి పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు మంగళవారం ఆసుపత్రిలో చేర్చారు. అనారోగ్యం తీవ్రం కావడంతో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు.

New Update
Paes

Paes

భారత క్రీడారంగానికి ఎంతో సేవ చేసిన హాకీ క్రీడాకారుడు, టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తండ్రి వేస్ పేస్ (80) గురువారం కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలం నుంచి పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు మంగళవారం ఆసుపత్రిలో చేర్చారు. అనారోగ్యం తీవ్రం కావడంతో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. వేస్ పేస్ భారత హాకీ జట్టులో మిడ్‌ఫీల్డర్‌గా చాలా కాలం ఆడారు. ఆయన కేవలం హాకీకి మాత్రమే పరిమితం కాకుండా ఫుట్‌బాల్, క్రికెట్, రగ్బీ వంటి క్రీడలను కూడా ఆడారు. 1996 నుంచి 2002 వరకు భారత రగ్బీ ఫుట్‌బాల్ యూనియన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. గోవాలో 1945లో జన్మించిన వేస్, క్రీడాకారుడిగానే కాకుండా మంచి విద్యావంతుడిగా కూడా గుర్తింపు పొందారు. హాకీ నుంచి రిటైర్ అయిన తర్వాత వేస్ స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్‌గా మారారు. బీసీసీఐ, భారత డేవిస్‌కప్ జట్టు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ వంటి వాటికి పేస్ సలహాదారుగా కూడా వ్యవహరించారు. భారత డేవిస్‌కప్ జట్టుకు సుమారు పదేళ్ల పాటు డాక్టర్‌గా సేవలందించారు.

ఇది కూడా చూడండి: Shubman Gill: ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’గా శుభ్‌మన్‌.. ఒక్క టెస్టుకే రికార్డులు కొల్లగొడుతున్న కెప్టెన్ గిల్

ఒలింపిక్స్ పథకం కోల్పోయి..

ఏ క్రీడాకారుడికైనా ఒలింపిక్ పతకం చాలా గొప్పది, అమూల్యమైనది. కానీ వేస్ పేస్ తన జీవితంలో అతి ముఖ్యమైన పతకాన్ని పోగొట్టుకున్నారు. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో ఆయన గెలిచిన కాంస్య పతకాన్ని ఎక్కడో జారవిడిచారు. ఆ పతకాన్ని తిరిగి పొందాలని, కనీసం దాని ప్రతిరూపాన్ని అయినా తయారు చేయించుకోవాలని ఆయన చాలా ప్రయత్నించారు, కానీ అది సాధ్యం కాలేదు. రెండు సంవత్సరాల క్రితం ఆయన మాజీ సహచరుడు, మేజర్ ధ్యాన్‌చంద్ కుమారుడు అశోక్ కుమార్, వేస్ పేస్‌ను కలవడానికి వెళ్లారు. అప్పుడు వేస్ పేస్ తన పతకం పోగొట్టుకున్న విషయాన్ని అశోక్‌తో పంచుకున్నారు. అశోక్ కుమార్ కూడా 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో భారత జట్టులో సభ్యుడు. వేస్ పేస్ బాధను చూసి, అశోక్ తన ఒలింపిక్ పతకాన్ని ఆయనకు ఇచ్చారు. ఆ పతకం వేస్ పేస్ దగ్గర ఆరు నెలల పాటు ఉంది. ఆ సమయంలో దాని ప్రతిరూపాన్ని తయారు చేయించడానికి చాలా చోట్ల ప్రయత్నించారు కానీ అది సాధ్యం కాలేదు. చివరికి అశోక్ పతకాన్ని తిరిగి ఇచ్చేశారు. దీనిబట్టి చూస్తే అతనికి ఒలింపిక్స్ పథకం ఎంత ముఖ్యమో అని తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Sachin Son: సైలెంట్ గా సచిన్ టెండూల్కర్ కొడుకు నిశ్చితార్థం..ముంబైకు చెందిన వ్యాపార వేత్త మనువరాలితో..

Advertisment
తాజా కథనాలు