PBKS vs KKR : అదరగొట్టిన కోల్‌కతా బౌలర్లు.. పంజాబ్ కింగ్స్ 111 ఆలౌట్

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తడబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు 15.3 ఓవర్లలో 111 పరుగులకే చాపచుట్టేసింది. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా 3, వరుణ్‌ 2, సునీల్ నరైన్ 2, నోకియా, వైభవ్ అరోరా చెరో వికెట్ పడగొట్టారు.

New Update
kkr vs pbks

kkr vs pbks

కోల్‌కతా నైట్‌రైడర్స్‌  తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టీమ్ తడబడింది.  టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు15.3 ఓవర్లలో 111 పరుగులకే చాప చుట్టేసింది. ప్రియాంశ్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్ (30) ఓపెనర్లుగా దిగి  వరుస బౌండరీలతో హోరెత్తించారు. దూకుడుగా ఆడుతున్న  ప్రియాంశ్‌ ఆర్యకు  హర్షిత్ రాణా చెక్ పెట్టాడు.  హర్షిత్ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో తొలి బంతికి సిక్స్ కొట్టిన ప్రియాంశ్.. తర్వాత బంతికే భారీ షాట్ ఆడి రమణ్‌దీప్ సింగ్‌కు చిక్కాడు.  

శ్రేయస్ అయ్యర్ డకౌట్

ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (0) డకౌట్ అయ్యాడు. హర్షిత్ వేసిన 3.4 ఓవర్‌కు రమణ్‌దీప్‌ సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ కాసేపటికే  వరుణ్ చక్రవర్తి వేసిన 4.5 ఓవర్‌కు జోష్ ఇంగ్లిస్ (2) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.  ఆ తరువాత ఓపెనర్  ప్రభ్‌సిమ్రన్ సింగ్ కూడా హర్షిత్ రాణా బౌలింగ్ లోనే వికెటం సమర్పించుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన  నేహల్ వధేరా (10), మ్యాక్స్‌వెల్ (7) మరోసారి నిరాశపర్చారు.  

దీంతో 76 పరుగులకే పంజాబ్ ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  లో ఆర్డర్ కూడా వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. సుర్యాంశ్ షెడ్గే (4), మార్కో యాన్సెన్ (1), శశాంక్ సింగ్ (18) పరుగులు చేశారు. దీంతో 111 పరుగులకే పంజాబ్ చాపచుట్టేసింది.  కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా 3, వరుణ్‌ చక్రవర్తి 2, సునీల్ నరైన్ 2, నోకియా, వైభవ్ అరోరా చెరో వికెట్ పడగొట్టారు.

Also Read : Toll charges: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు