/rtv/media/media_files/2025/09/30/wldcp-2025-09-30-15-38-51.jpg)
Women’s World Cup: మహిళల వన్డే ప్రపంచకప్ ఇవాళ ప్రారంభమైంది. భారత్-శ్రీలంక మధ్య మొదటిమ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ ఐసీసీ టోర్నీని పురష్కరించుకుని గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను సృష్టించింది. ప్రపంచకప్ వేడుకలను గుర్తుచేసుకునేందుకు ఈ డూడుల్ ను రూపొందించినట్లు గూగుల్ తెలుపగా.. బాల్, బ్యాట్, వికెట్లతోపాటు పలు కలర్లను జతచేసింది.
ఈ మేరకు13వ ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచకప్ ను గూగుల్ అద్భుతమైన డూడుల్‌తో వేడుకలను ప్రారంభించగా.. డూడుల్ బ్యాట్, బాల్, వికెట్, పిచ్‌ను వర్ణిస్తుంది. పురుషుల ప్రపంచకప్‌కు రెండు సంవత్సరాల ముందు 1973లో మహిళల క్రికెట్ ప్రపంచకప్ ప్రారంభమైందని, అప్పటి నుంచి మహిళల క్రికెట్‌కు ప్రజాదరణ క్రమంగా పెరుగుతోందని గూగుల్ ఈ సందర్భంగా తెలిపింది.
గూగుల్ డూడుల్ అంటే ఏమిటి?
గూగుల్ డూడుల్ అనేది ఒక ముఖ్యమైన రోజు, పండుగ, సాంస్కృతిక క్షణం లేదా చారిత్రక సంఘటనను జరుపుకోవడానికి సింబల్ గా క్రియేట్ చేస్తారు. ఒక ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడల్లా గూగుల్ తన హోమ్‌పేజీ లోగోను క్రియేటివ్, ఇంటరాక్టివ్ డిజైన్‌గా మారుస్తుంది. దీనినే మనం డూడుల్ అని పిలుస్తాం. గూగుల్ ఇప్పటికీ 5,000 కంటే ఎక్కువ డూడుల్‌లను సృష్టించింది. వీటిలో ఒకటి నేటి నుండి ప్రారంభం కానున్న ఐసిసి మహిళల ప్రపంచ కప్ కోసం క్రియేట్ చేసిన డూడుల్ ఒకటిగా నిలిచింది.
Also Read: Bigg Boss Telugu Promo: గేమ్ ఛేంజర్ పవన్.. సుమన్ శెట్టి VS రీతూ నామినేషన్స్ లో రచ్చ రంబోలా!
ఇక రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే టోర్నీలో ప్రతి జట్టు.. మిగతా 7 జట్లతో ఒక్కో లీగ్ మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశ ముగిసేసరికి టాప్-4 నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ దశ అక్టోబరు 26న ముగియనుండగా 29, 30 తేదీల్లో సెమీస్ జరుగుతాయి. ఫైనల్ నవంబరు 2న నిర్వహిస్తారు. మహిళల వన్డే ప్రపంచకప్‌లను ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో ఏడుసార్లు (1978, 1982, 1988, 1997, 2005, 2013, 2022) గెలచుకుంది. ఇంగ్లాండ్ నాలుగుసార్లు (1973, 1993, 2009, 2017) ఛాంపియన్ నిలవగా.. న్యూజిలాండ్ ఒకసారి (2000) టైటిల్ సొంతం చేసుకుంది.
జట్లు ఇవే:
1. భారతదేశం
2. ఆస్ట్రేలియా
3. ఇంగ్లాండ్
4. దక్షిణాఫ్రికా
5. న్యూజిలాండ్
6. పాకిస్తాన్
7. శ్రీలంక
8. బంగ్లాదేశ్