IPL 2025 : ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పీటర్సన్ ఐపీఎల్‌లో మెంటార్‌గా పనిచేయడం ఇదే తొలిసారి.  పీటర్సన్ చివరిసారిగా 2016లో పూణే తరుపున ఐపీఎల్ లో ఆడాడు. 

New Update
kevin

ఐపీఎల్‌  2025 సీజన్ కు ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని  ఆ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ క్యాపిటల్స్ కి హేమాంగ్ బదానీ (ప్రధాన కోచ్), మాథ్యూ మోట్ (అసిస్టెంట్ కోచ్), మునాఫ్ పటేల్ (బౌలింగ్ కోచ్), వేణుగోపాల్ రావు (క్రికెట్ డైరెక్టర్)లతో పీటర్సన్ చేరనున్నాడు.  పీటర్సన్ ఐపీఎల్‌లో మెంటార్‌గా పనిచేయడం ఇదే తొలిసారి.  అతను చివరిసారిగా 2016లో పూణే సూపర్‌జెయింట్ తరుపున ఐపీఎల్ లీగ్‌లో ఆడాడు. 

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 2025 సీజన్‌కు గానూ కెప్టెన్‌ను ఇంకా ప్రకటించలేదు. గత సీజన్‌లో రిషబ్ పంత్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.  మెగా వేలానికి ముందు అతన్ని రిటర్న్ చేయలేదు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను రూ. 27 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది, లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు.  

ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్ గా

అంతర్జాతీయ క్రికెట్‌లో 13 వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన పీటర్సన్, 2014 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్ గా వ్యవహరించాడు.  దురదృష్టవశాత్తు, ఆ సీజన్‌లో ఢిల్లీ కేవలం రెండు విజయాలతో చివరి స్థానంలో నిలిచింది. పీటర్సన్ 2009, 2010 ఐపీఎల్‌ సీజన్ లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. 

2012, 2014లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. ఐపీఎల్‌లో అతని అత్యుత్తమ సీజన్ 2021 అని చెప్పాలి. ఈ సీజన్ లో ఢిల్లీ తరపున ఒక సెంచరీతో సహా 305 పరుగులు చేశాడు పీటర్సన్ . 2016లో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్‌లో పీటర్సన్ ఐపీఎల్ కెరీర్‌ను ముగించాడు. ఐపిఎల్ కెరీర్‌లో పీటర్సన్ 36 ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడగా..  134.72 స్ట్రైక్ రేట్‌తో 1001 పరుగులు చేశాడు.  

Also read :  ఆ పాట పాడినందుకు సిగ్గుగా ఉంది! కత్రినా పాటపై శ్రేయా ఘోషల్ హాట్ కామెంట్స్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు