అది తెలివి తక్కువతనమే.. ఫైనల్లో భారత్ ఓటమిపై అంబటి రాయుడు
వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ఓటమిపై మాజీ ఆటగాడు అంబటి రాయుడు తన అభిప్రాయం వెల్లడించారు. పిచ్ నెమ్మదిగా ఉండడం వల్లే భారత్ ఓడిపోయింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో పిచ్ మొదటి నుంచి ఆఖరిదాకా ఒకేలా ఉండడమే మంచిది. ఫైనల్లో పిచ్‌ను ఇలా తయారు చేయడం తెలివి తక్కువతనమే అన్నారు.