/rtv/media/media_files/2025/03/04/gGCwDo3fJ9fZBlhj48Qi.jpg)
Live News Updates in Telugu Photograph: (Live News Updates in Telugu)
భారత రెజ్లర్ సుశీల్ కుమార్ కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2021 జూనియర్ రెజ్లర్ సాగర్ ధంకర్ హత్య కేసులో సుశీల్ కుమార్ కు మంగళవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. కాగా ఈ కేసులో సుశీల్ కుమార్ ను 2021 మేలో పోలీసులు అరెస్ట్ చేశారు. 2023 జూలైలో మోకాలి శస్త్రచికిత్స కోసం 7 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.
Also read : Warren Buffett: ట్రంప్ నిర్ణయం అత్యంత ప్రమాదకరమైనది: వారెన్ బఫెట్!
2021 Junior wrestler Sagar Dhankar murder case | Delhi High Court granted regular bail to wrestler Sushil Kumar. He was arrested in the May 2021 murder case.
— ANI (@ANI) March 4, 2025
He was earlier granted 7 days interim bail for knee surgery in July 2023.
Also read : కడసారి చూపు కూడా వీడియో కాల్ లోనే...భగవంతుడా ఇంతటీ దయనీయ పరిస్థితి ఎవరికి వద్దయ్యా!
18 మంది నిందితుల్లో సుశీల్
కాగా ఒలింపిక్స్‌లో భారతదేశానికి రజత, కాంస్య పతకం సాధించారు రెజ్లర్ సుశీల్ కుమార్. సాగర్ ధంకర్ హత్య కేసులో 18 మంది నిందితుల్లో సుశీల్ ఒక నిందితుడు. కాగా ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద 2021 మే 4న సాగర్‌తో పాటు అతని స్నేహితులు సోను, అమిత్ కుమార్‌పై సుశీల్ కుమార్, అతని స్నేహితులు దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Also read : CM Revanth: ఉమెన్స్ డే గిఫ్ట్.. మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ శుభవార్త!
Also read : ఏపీలో సత్తా చాటిన కూటమి.. మరో ఎమ్మెల్సీ స్థానంలో ఘన విజయం!