CSK vs PBKS : చాహల్ హ్యాట్రిక్.. యువరాజ్ సింగ్ సరసన!

చిదంబరం స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. యుజ్వేంద్ర చాహల్ 19 ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఇందులో హ్యాట్రిక్ ఉంది.

New Update
chahal

chahal

చిదంబరం స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. యుజ్వేంద్ర చాహల్ 19 ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఇందులో హ్యాట్రిక్ ఉంది. దీపక్ హుడా, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ అనే ముగ్గురు బ్యాట్స్‌మెన్ లను చాహల్ తన బౌలింగ్‌లో వెనక్కి పంపాడు.   చెన్నై బ్యాటర్లలో సామ్ కరన్ (88; 47 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదరగొట్టాడు.  డెవాల్డ్ బ్రెవిస్ (32) పరుగులు చేశారు. కాగా ఐపీఎల్ చరిత్రలో చాహల్ కు ఇది రెండో హ్యాట్రిక్ కావడం విశేషం.  చాహల్ అంతకుముందు హ్యాట్రిక్ 2022 ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సాధించాడు.  దీంతో చాహల్ ఐపీఎల్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన యువరాజ్ సింగ్‌ సరసన చేరాడు.  అమిత్ మిశ్రా మూడు హ్యాట్రిక్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్ లో హ్యాట్రిక్స్ జాబితా

లక్ష్మీపతి బాలాజీ (CSK) vs పంజాబ్ కింగ్స్ (2008)
అమిత్ మిశ్రా (DK) vs డెక్కన్ ఛార్జర్స్ (2008)
మఖాయ ంటిని (CSK) vs కోల్‌కతా నైట్ రైడర్స్ (2008)
యువరాజ్ సింగ్ (కెఎక్స్ఐపి) vs ఆర్‌సిబి (2009)
రోహిత్ శర్మ (DC) vs ముంబై ఇండియన్స్ (2009)
యువరాజ్ సింగ్ (KXIP) vs డెక్కన్ ఛార్జర్స్ (2009)
ప్రవీణ్ కుమార్ (ఆర్‌సిబి) vs రాజస్థాన్ రాయల్స్ (2010)
అమిత్ మిశ్రా (DC) vs కింగ్స్ XI పంజాబ్ (2011)
అజిత్ చండిలా (RR) vs పూణే వారియర్స్ (2012)
సునీల్ నరైన్ (KKR) vs KXIP (2013)
అమిత్ మిశ్రా (SRH) vs పూణే వారియర్స్ (2013)
ప్రవీణ్ తాంబే (RR) vs KKR (2014)
షేన్ వాట్సన్ (RR) vs SRH (2014)
అక్షర్ పటేల్ (KXIP) vs గుజరాత్ లయన్స్ (2016)
ఆండ్రూ టై (GL) vs రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ (2017)
శామ్యూల్ బద్రీ (RCB) vs ముంబై ఇండియన్స్ (2017)
జయదేవ్ ఉనద్కత్ (RPSG) vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (2017)
సామ్ కుర్రాన్ (KXIP) vs ఢిల్లీ క్యాపిటల్స్ (2019)
శ్రేయాస్ గోపాల్ (RR) vs RCB (2019)
హర్షల్ పటేల్ (RCB) vs ముంబై ఇండియన్స్ (2021)
యుజ్వేంద్ర చాహల్ (RR) vs KKR (2022)
రషీద్ ఖాన్ (GT) vs KKR (2023)
యుజ్వేంద్ర చాహల్ (PBKS) vs CSK (2025)*

Also Read: దొంగ కాదు గజదొంగ.. కళ్లలో కారం కొట్టి డబ్బులతో పరార్ - వీడియో చూశారా?

Advertisment
Advertisment
Advertisment